ఆన్ లైన్ లో టీటీడీ క్యాలెండర్ల అమ్మకం
TTD Arjitha Seva Tickets for March 2025
SRIVARI ARJITHA SEVA TICKET RELEASE
TTD tickets online
TTD Darshanam tickets in online
TTD News
General News
By
Peoples Motivation
ఆన్ లైన్ లో టీటీడీ క్యాలెండర్ల అమ్మకం
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఇప్పటివరకు లైన్‌లో, ఈ విధానం ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. ప్రస్తుతం లైన్‌లో ఆర్డర్ చేసి టీటీడీ క్యాలెండర్లు, డైరీలను తెప్పించుకో ఆన్‌లైన్ చైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. 2025 సంవత్సరానికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు, సింగిల్ షీట్, టేబుల్ టాప్ క్యాలెండర్‌లను అందుబాటులో ఉంచినట్లు.
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు, శ్రీ పద్మావతి సమేతంగా శ్రీవారి ఫొటోతో క్యాలెండర్లను తయారు చేసినట్లు చెప్పారు. వీటితో పాటు డీలక్స్ డైరీలు, చిన్న డైరీలను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని వివరించారు. టీటీడీ క్యాలెండర్‌లు, డైరీలు కావాల్సిన వారు www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని అన్నారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులలోని ప్రముఖ బుక్ స్టోర్లలో శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.
Comments