-Advertisement-

ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు

• సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు…తేమశాతంలో కచ్చితత్వం ఉండాలి

• పెట్టుబడి తగ్గించి...ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం

- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన సీఎం

పెనమలూరు:- ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించారు. రైతుల నుంచి ధాన్య సేకరణ ఎలా చేస్తున్నారో సీఎంకు రైతు సేవాకేంద్రం సిబ్బంది వివరించారు. అనంతరం తాము ధాన్యం ఎలా అమ్ముతున్నది సీఎంకు రైతులు వివరించారు. గతేడాది కంటే ఈ ఏడాది పంట ఎక్కువగా వచ్చిందని, మిషన్ కోత వల్ల ఎకరానికి అయిదారు వేలు కలిసి వచ్చిందని రైతులు చెప్పారు. కోసిన గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్లు తీసుకుంటే మరో రూ.5 వేల వరకూ వస్తుందని రైతులకు సీఎం తెలిపారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయా అని సీఎం అడగ్గా...డబ్బులు కరెక్టుగానే వస్తున్నాయని రైతులు సమాధానమిచ్చారు. ప్రోక్యూర్మెంట్‌కు షెడ్యూలింగ్ మొత్తం ఒకటిగా లేదా... వేర్వేరుగా పంట కోత కోస్తే పార్ట్ షెడ్యూలింగ్ ఇస్తామని సిఎంకు సేవాకేంద్రం సిబ్బంది వివరించారు. సాగు చేస్తున్న పొలాన్ని బట్టి రైతుకు దిగుబడి ఎంత వస్తుందో కూడా నమోదు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అనంతరం ధాన్యం తేమశాతాన్ని ఎలా గణిస్తారో స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలించారు. తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లులో కూడా అంతే రావాలని, మార్పు వస్తే చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. 


ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు

రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమశాతం పరిశీలించిన అనంతరం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఒకరోజు మందుగానే రైతులకు ధాన్యం డబ్బులు ఇస్తే మరింత సంతోషిస్తారు. క్షేత్రస్థాయిలోకి నేను వచ్చింది రైతులతో మాట్లాడటానికే. మీ  సూచనలు, సలహాలు కూడా తీసుకునేందుకు వచ్చాను. ఏ పంట పండిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో రైతులు ఆలోచించుకోవాలి. భూమి, వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకుని పంట సాగు చేయాలి. నీళ్లు సరైన సమయంలో ఇవ్వకపోవడంతోనే రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలతో అప్పులపాలవుతున్నారు. గత 5 సంవత్సరాలు కాలువల్లో పూడిక తీయలేదు.  పట్టిసీమ ద్వారా సకాలంలోనే వరినాట్లకు నీరందిస్తాం. వ్యవసాయం మన  సంస్కృతి, వ్యసనం. రైతుకు ఒక్కరోజు పొలం చూడకపోయినా నిద్రరాదు. సొంత భూమిలో చేసినా, కౌలుకు చేసినా రైతులకు ఆదాయం రావాలి. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు కోరిన విధంగా డ్రయర్ మిషన్లు పొలం వద్దకే పంపే ఏర్పాటు చేస్తాం.’ అని సీఎం సీఎం అన్నారు. కాలువలపై ఎంక్రోచ్ మెంట్ ఉండటం వల్ల నీరు సరిగా రావడం లేదని అధికారులు సీఎంకు తెలపగా...వాటిని తీసేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంట దిగుబడి సరిగా రాని రైతుకు బెస్ట్ ప్రాక్టీసస్ ఆచరించి పంట దిగుబడి పెంచేలా అధికారులు గైడ్ చేయాలన్నారు. ఏ పంటకు ఎంత డిమాండు ఉంది, మార్కెటింగ్ ఎలాగనేది కూడా రైతులకు అధికారులు చెప్పాలన్నారు. అనంతరం  రైతులకు సీఎం చంద్రబాబు టార్ఫాలిన్ పరదాలు పంపిణీ చేశారు.

Comments

-Advertisement-