-Advertisement-

గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా..మరమ్మతు పనులను ముమ్మరం చేయాలన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా..మరమ్మతు పనులను ముమ్మరం చేయాలన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

• రోడ్ల మరమ్మతు పనుల ప్రగతిపై ఆర్ & బీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి

• జనవరి తొలి వారం నాటికే లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రణాళికలు రచించుకోవాలన్న మంత్రి

• మరమ్మతు పనుల్లో వెనుకబడ్డ డివిజన్ లలో పనులు తిరిగి పుంజుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం

Bc Janardhan Reddy

గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి రహదారుల మరమ్మతు పనులను పూర్తి చేసి, గుంతల రహిత రహాదారుల లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాల్సిందేనని ఆర్ & బీ శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.. నేడు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ & బీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం అనుకున్న విధంగా గుంతల రహిత రహదారుల టార్గెట్ ను చేరుకోవడానికి కేవలం నెల రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో మరమ్మతుల పనులను మరింత ముమ్మరం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్ధిష్ట కాల పరిమితిని పెట్టుకుని, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని, ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేసే విధంగా ముందుకుసాగాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఈ ఎన్ సీ నయిముల్లా, ఏపీ ఆర్డీసీ ఛీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రహదారులను అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందని, కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. రోడ్ల మరమ్మతుల పనులకు సంబంధించి డివిజన్ల వారీగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్న రోజు వారి ప్రగతి వివరాలపై ఆయా డివిజన్ల అధికారులతో మంత్రి మాట్లాడారు. కొత్త ఏడాదిలో ప్రజలకు మంచి రోడ్లు అందించాలనే ఆలోచనతో జనవరి తొలి వారం నాటికే పనులు పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల నుంచి రోడ్లకు సంబంధించి ఏ విధమైన విమర్శలకు తావులేకుండా పనిచేయాలన్నారు. వివిధ కారణాలతో వెనుకబడ్డ డివిజన్లకు సంబంధించి వ్యక్తిగతంగా మాట్లాడి, ఎప్పటిలోపు పనులు పూర్తి చేస్తారో టార్గెట్ ఫిక్స్ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఇప్పుడు వెనుకబడ్డ డివిజన్ లు వచ్చే సమావేశం నాటికి పనుల్లో వేగం పుంజుకోవాలన్నారు..


రాష్ట్రంలోని మొత్తం 45,378 కి.మీ మేర రాష్ట్ర మరియు జిల్లా ప్రధాన రోడ్లు ఉండగా, అందులో 22,299 కి.మీ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మొత్తంగా రూ. 861 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇప్పటి వరకు 4,157 కి.మీ మేర రోడ్లను గుంతల రహిత రహదారులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.. 


ముఖ్యమంత్రితో పాటు తామంతా రోడ్ల ప్రగతిపై ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. అలాగే ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించడం ద్వారా రోడ్ల మరమ్మతులను తాను స్వయంగా పర్యవేక్షించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల పనుల విషయంలో సీరియస్ గా ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సైతం మరింత కష్టపడి పనిచేయాలన్నారు.


 రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించిన సమయంతో పోలిస్తే, వర్షాలు వంటి కారణాలతో నేడు కొన్ని డివిజన్ లలో పనులు ముందకొడిగా సాగుతున్నాయని, కాబట్టి ఆయా డివిజన్లలో పనులు తిరిగి వేగం పుంజుకోవాలంటే యుద్ధ ప్రాతిపదికన పని చేయాలన్నారు. అదే సమయంలో ఆయా పనులును సకాలంలో పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లపై కూడా ఒత్తిడి పెంచాలన్నారు.. సకాలంలో పనులు పూర్తి చేసిన వారికి జాప్యం లేకుండా త్వరితగతిన బిల్లులు అందజేస్తామని మంత్రి తెలిపారు. 


గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా మిషన్ మోడ్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తోందని, అదే సమయంలో రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎంత మాత్రం రాజీపడవద్దని మంత్రి స్పష్టం చేశారు. రోజు వారీ రోడ్ల పనుల ప్రగతికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ.. ఎక్కడైనా లోపాలుంటే ఆయా అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమన్వయం చేసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు మంత్రి సూచించారు.

Comments

-Advertisement-