న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే ఇక అంతే..?
న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే ఇక అంతే..?
New Year Wishes Cyber Crime (APK File):
న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే ఇక ఏముంది మీరే కాదు మీ వలన గ్రూప్ లో ఉండే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు
తిరుపతి జిల్లా ప్రజలందరూ... తస్మాత్ జాగ్రత్త ఒక APK ఫైల్‌తో, రాబోతున్నటువంటి "న్యూ ఇయర్ విషెస్" అనే పదాన్ని వాడుకొని సైబర్ నేరగాళ్లు ట్రేండింగ్ చేసి డబ్బులు కాజేయడానికి సిద్ధమవుతున్నారు మనం వాటిని ఆపాలి మరియు ఎవరిని మోసపోనివ్వకూడదు. ఆలా వచ్చిన APK ఫైల్ ను ఓపెన్ చేసారంటే ఇక ఏముంది మీ ఫోన్ కంట్రోల్ మొత్తం నెరస్థుల చేతిలోనికి వెళ్తుంది మీ మొబైలు ఆప్స్ అండ్ మీ మొబైల్ లో జరిగే ప్రతి కదలికలు మీద తెలియకుండానే డబ్బులు కాజేస్తారు. మీ స్నేహితులకు మీరు పంపినట్లుగానే వాట్సాప్ మెసేజ్ లు ద్వారా apk ఫైల్స్ పంపి, అందరి ఫోన్లు హ్యాక్ చేస్తారు.
Cyber Crime With New Year 2025 Wishes:
'నూతన సంవత్సర శుభాకాంక్షల' పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్లాన్ వేశారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., హెచ్చరించారు.
పొరపాటున లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతి:
న్యూ ఇయర్ విషెస్ చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు.
ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల అధీనం లోకి వెళ్లిపోతుంది.
బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది.. జాగ్రత్త!!’
తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. మీకు Whats App/ telegram వచ్చే APK ఫైల్ ను ఎట్టి పరిస్థులలో ఓపెన్ చేయకండి.
2. ప్రతీ గ్రూప్ అడ్మిన్ లు ఆక్టివ్ గా ఉండాలి మరియు గ్రూప్ నందు వచ్చే ప్రతి మెసేజ్ ను అప్రమత్తం గా గమనిస్తూ ఉండాలి.
3. APK వంటి స్కాం ఫైల్స్ ను వెంటనే గ్రూప్ అడ్మిన్ లు డిలీట్ చేయాలి.
4. మీరు గనక అనుకోకుండా ఫైల్ ను క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ తో ఓపెన్ చేసినట్లయితే, మీరు వెంటనే ఇంటర్నెట్ ను ఆప్ చేయవలెను. ఆలా చేసి నట్లయితే రిమోట్ కంట్రోల్ వర్క్ చేయదు.
5. అనవసరం గా సైబర్ crime fraudster చేసే కాల్ కు గురి అయ్యి డబ్బులను పోగొట్టుకోవద్దు,
6. దయచేసి సైబర్ జరిగింది అని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ కంప్లైంట్ గోల్డెన్ హౌర్స్ లో ఇచ్చినట్లయితే మీ యొక్క అమౌంట్ మీకు రిఫండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
తిరుపతి సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, తిరుపతి జిల్లా వారు తెలియజేయడం ఏమనగా మీరు ఎవరయినా సైబర్ crime బారిన పడినట్లయితే అధైర్య పడకుండా వెంటనే పోలీస్ గ్రౌండ్ నందు వున్నా సైబర్ crime ఆఫీస్ కు వెళ్లవలసినదిగా కోరుతున్నాము.
సైబర్ crime బారిన గురిఅయిన వెంటనే అనగా గోల్డెన్ హౌర్స్ రెండు గంటలు మించకుండా లేక కనీసం 24 గంటలో లోపు వెళ్ళినట్లయితే మీకు న్యాయం జరిగె అవకాసం ఎక్కువగా వుంటుంది మరియు మీరు అందుబాటులో లేనట్లయితే వెంటనే 1930 కాల్ చేయాలని తిరుపతి జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి.