సత్ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు. భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ.
▶️ సత్ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు. భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ..
▶️ నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువగల 435 మొబైల్ ఫోన్లు రికవరీ.
▶️ మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసి, మొబైల్ హంట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న తిరుపతి పోలీసులు.
-జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, ఐ.పి.యస్.,
తిరుపతి జిల్లా, డిసెంబర్ 18 (పీపుల్స్ మోటివేషన్):-
తిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం CEIR ద్వారా మరియు తిరుపతి జిల్లా పోలీసు వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన MOBIEL HUNT (WHATSAPP-9490617873) అప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 11 విడతలలో 3840 సెల్ ఫోన్ లను రికవరీ చేసి సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగింది. సుమారు వీటి విలువ రూ. 6,69,40,000/-.
“ప్రసుత్తం 12వ విడతలో నెల రోజుల వ్యవధిలోనే రికవరీ చేసిన 435 మొబైల్ ఫోన్ల (వాటి విలువ సుమారు రూ.87,00,000/-)” ఎస్పీ కార్యాలయం నందు జరిగిన పత్రికా సమావేశం నందు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బారాయుడు, ఐ.పి.యస్., గారు వివరాలను వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఇప్పటి వరకు MOBILE HUNT APPLICTION మరియు CEIR ద్వారా 12 విడతలకుగాను మొత్తం రూ.7,56,40,000/-. విలువగల 4275 మొబైల్ ఫోన్లు రికవరీచేసి బాధితులకు అప్పగించడం జరిగింది. CEIR లో పిర్యాధు చేసిన సెల్ ఫోన్ ల రికవరీ నందు తిరుపతి జిల్లా రాష్ట్రం లో ప్రథమ సస్థానం లో ఉందన్నారు.
ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్లు పోతే పోలీస్ వారు ఏర్పాటు చేసిన MOBIEL HUNT 9490617873 నెంబర్ కు WhatsAppలో Hi లేదా HELP అని మెసేజ్ చేస్తే వచ్చే link నందు తమ యొక్క వివరాలను పూరించాలి లేదా CEIR (Central Equipment Identity Register) పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుంది. అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు.
ముఖ్యంగా తిరుపతి ఒక అధ్యాత్మిక నగరం. ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తారు, వారి యొక్క మొబైల్ ఫోన్ ను పోగొట్టుకుంటున్నారు. దానిలో భాగంగా కొన్ని మొబైల్ లను రికవరీ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు సాధ్యమైనంతవరకు CEIR పోర్టల్, MOBILE HUNT whatsapp అప్లికేషను ద్వారా పూర్తిగా మీ యొక్క వివరాలను పొందుపరిచి వెంటనే మాకు పంపిస్తే పోగొట్టుకున్న మొబైల్ లను బాధితులకు అందజేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా ప్రజలు కూడా CEIR పోర్టల్ ను వినియోగించుకోవాలి. దొంగతనం చేసిన మొబైల్ లను మొబైల్ షాప్ యజమానులకు అమ్మాలని చూస్తారు. షాప్ యజమానులు అపరిచితుల వ్యక్తుల నుండి మొబైల్ కొనుగోలు చేయడం కూడా నేరమే, మీరు కూడా నేరానికి బాధితులు అవుతారు. అపరిచితులు అమ్మిన మొబైల్ లను ఎవరు కూడా కొనకూడదు. జిల్లా ప్రజలు సైబర్ నేరాలకు దూరంగా ఉండి మొబైల్ వాడడంలో కూడా తగిన జాగ్రత్తలు పడి, అనవసరంగా లింక్ లను ఓపెన్ చేయకుండా ఉండటం, OTP లను షేర్ చేయకుండా ఉండటం, లోన్ యాప్ జోలికి వెళ్ళకుండా ఉండటం, ముఖ్యంగా పిల్లలు వాడే ఫోన్ లను తల్లిదండ్రులు నిఘా ఉంచి ఈ సైబర్ నేరాలను దూరంగా ఉండాలని తెలియజేసారు.
మొబైల్ మిస్/దొంగలించబడితే తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. మీ యొక్క మొబైల్ నెంబర్ ను వెంటనే ఆలస్యం చేయకుండా బ్లాక్ చేపించుకోవాలి
2. మీ యొక్క మొబైల్ పాస్వర్డ్ , Phone Pe/Google Paytm,. etc. పాస్వర్డ్లులు చాల స్ట్రాంగ్ ఉండాలి.
3. మొబైల్ ను మిస్/ దొంగలించబడితే మీరు వెంటనే మొబైల్ హంట్ నెంబర్ కు గాని లేక CEIR పోర్టల్ నందు మీరు కంప్లైంట్ రైజ్ చేయవలెను.
• ఈరోజు అందజేసిన మొబైల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా రికవరీ చేయడం జరిగింది.
• సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయరాదు, అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కల్గిన బాక్సు ఉంటేనే కొనుగోలు చేయాలి.
• అపరిచితులతో ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు.. అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతాడని గుర్తించాలి.
తిరుపతి జిల్లా పోలీసు వారు MOBILE HUNT వాట్సాప్ సర్వీసులు, CEIR పోర్టల్ గురించి ఇప్పటికేప్రజలకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా కల్పిస్తున్నారు. మీడియా కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
రాష్ట్ర డిజిపి CH.ద్వారకతిరుమలరావు ఐ.పి.యస్.,గారి యొక్క ఆదేశాలపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, ఐపీఎస్., పర్యవేక్షణలో తిరుపతి సైబర్ క్రైమ్ సి.ఐ. ఆర్.వినోద్ కుమార్ అధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పోగొట్టుకున్న మొబైల్స్ ను రికవరీ చేసి భాదితులకు అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా సెల్ ఫోన్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సి.ఐ ఆర్.వినోద్ కుమార్ మరియు సైబర్ క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడుల్ ఐ.పి.యస్., ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించినారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి వెంకటరావు అడ్మిన్, సైబర్ ల్యాబ్ సి.ఐ వినోద్ కుమార్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.