జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన చౌక ధర దుకాణాలకు దరఖాస్తులు స్వీకరణ
జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన చౌక ధర దుకాణాలకు దరఖాస్తులు స్వీకరణ
కర్నూలు, పీపుల్స్ మోటివేషన్:- కర్నూలు జిల్లా నందు హేతుబద్ధీకరణ ద్వారా నూతనముగా ఏర్పడిన చౌకధరల దుకాణములకు మరియు వివిధ రకముల కారణములతో ఖాళీ ఏర్పడిన చౌకధరల దుకాణములకు శాశ్వత ప్రాతిపదికన డీలర్లను నియమించుటకు సంబధిత రెవిన్యూ డివిజనల్ అధికారుల ద్వార నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు డీలర్ల ఎంపిక వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగును. కావున ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో పొందు పరచిన నిబంధనలకు లోబడి తమ ఆర్జీలను సబ్ కలెక్టర్, ఆదోని మరియు రెవిన్యూ డివిజనల్ అధికారుల వారి కార్యాలయము, పత్తికొండ మరియు కర్నూలు వారికి నేరుగా కాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కాని అందచేయవలెను. అర్జీ నమూనా కావలసిన వారు సంబంధిత మండల తహశీల్దారు వారి కార్యాలయములో కానీ, లేదా సబ్ కలెక్టర్, ఆదోని మరియు రెవెన్యూ డివిజినల్ అధికారుల వారి కార్యాలయము, పత్తికొండ మరియు కర్నూలు వారి కార్యాలయములలో కార్యాలయ పని వేళలో పొందవచ్చును.
జిల్లా నందు మొత్తం ఖాళీల వివరాలు:
కర్నూల్ డివిజన్లో ఖాళీలు..
సి బెళగల్, 6 షాపులో, గూడూరు,4, కల్లూరు 6, కోడుమూరు,12, కర్నూల్ 6, కర్నూల్ అర్బన్ 31, ఓర్వకల్ 2, వెల్దుర్తి 9.
ఆదోని డివిజన్లో ఖాళీలు..
ఆదోని 32, గోనెగండ్ల 3,, హెుళగుంద 2,, కోసిగి 10,,కౌతాళం 4,, నందవరం 2,, పెద్దకడబూరు 9,, ఎమ్మిగనూరు 6.
పత్తికొండ డివిజన్లో ఖాళీలు..
ఆలూరు 13,, ఆస్పరి 3,, దేవనకొండ 4,,హాలహర్వి 5,, క్రిష్ణగిరి 2,, మద్దికేర ఈస్ట్ 2,,పత్తికొండ 12,, తుగ్గలి 4.