పోలీస్ సేవలు ఇకపై సులభతరం..
పోలీస్ సేవలు ఇకపై సులభతరం..
➡️ తిరుపతి జిల్లా ప్రజల సౌకర్యార్థం పోలీసు శాఖ వెబ్‌సైట్ సేవలను ప్రారంభించింది.
➡️ ప్రజలకు అవసరమైన పోలీసు సేవలు మరియు సమాచారాన్ని https://Tirupatipolice.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
➡️ పారదర్శకత, జవాబుదారీతనం మరియు పౌర-స్నేహపూర్వక పోలీసింగ్.
-జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్.,
తిరుపతి జిల్లా, డిసెంబర్ 18 (పీపుల్స్ మోటివేషన్):-
తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం రోజు ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆధునికరించిన కొత్త పోలిస్ వెబ్ సైట్ ను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ, ప్రజల సౌలభ్యం కోసం, సిటిజన్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌ను ప్రారంభించాము. ఈ వెబ్‌సైట్ పారదర్శకత, జవాబుదారీతనం మరియు ప్రజా సేవలకోసం మెరుగైన ఫలితాలు అందించే దిశగా అడుగు ముందుకు వేసము. ఈ వెబ్‌సైట్ ప్రజలకోసం, వారి సౌలభ్యం కోసం ప్రాధాన్యతగా రూపొందించడం జరిగింది, పౌరులు పోలిస్ సేవలకోసం వెబ్‌సైట్ [https://Tirupatipolice.ap.gov.in]ని యాక్సెస్ చేయవచ్చు అని అన్నారు.
NIC (National informatic center) వారి సహకారంతో తిరుపతి జిల్లా పోలీసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు యొక్క వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది, ప్రజలకు మరింత దగ్గరగా అవ్వడానికి మరియు పోలిస్ సేవలను ప్రజలు తెలుసుకోవడానికి ఈ పోలీస్ వెబ్ సైట్ ఉపయోగపడవచ్చు, ఇంకా రాబోయే కాలంలో ఈ వెబ్ సైట్ ద్వారా ఇంకా మెరుగైన సేవలను అందించి, ప్రజలకు మరింత దగ్గరగా అవ్వడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి వెంకటరావు అడ్మిన్, యన్.వెంకటేశ్వర్ రావు జాయింట్ డైరెక్టర్ (ఐ.టి), బి.కే సుధాకర్ డిస్ట్రిక్ట్ ఇంఫోర్మటిక్ ఆఫీసర్ వారు పాల్గొన్నారు.