-Advertisement-

హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

• రాంపురం గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా

• డిశ్చార్జి చేసినా హాస్టల్ లో వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే ఉంచాలని మంత్రి ఆదేశం

అమరావతి, పీపుల్స్ మోటివేషన్:- రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోకి బయట ఆహారాన్ని తీసుకుకరానివ్వొద్దని బీసీ సంక్షేమ శాఖాధికారుల, హాస్టల్ సిబ్బందిని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 13 మంది బాలికలు స్వల్ప అసస్థతకు గురయ్యారు. 

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

రాంపురం ప్రాథమిక వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం మంగళవారం ఉదయం వారిని డిశ్చార్జి చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత...విద్యార్థినులతోనూ, వైద్యులతోనూ, గురుకుల సిబ్బందితోనూ ఫోన్లో మాట్లాడారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని మంత్రితో వైద్యులు తెలిపారు. విద్యార్థినులంతా కోలుకున్నారని, వారిని డిశ్చార్జి చేశామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం హాస్టల్ లోనే విద్యార్థినులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు గురుకుల సిబ్బంది తెలిపారు. బాలికలను డిశ్చార్జి చేసినా హాస్టల్ లోనే వైద్యుల పర్యవేక్షలోనే ఉంచాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. గురుకుల పాఠశాలల మిగిలిన విద్యార్థినుల పరిస్థితిపైనా మంత్రి ఆరా తీశారు. వారంతా బాగున్నారని, ఆదివారం కావడంతో, హాస్టల్ చుట్టు పక్కల ఉన్న షాపుల నుంచి కూడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసి విద్యార్థినులు తిన్నారని తెలిపారు. అటువంటి వారే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. దీనిపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం చేశారు. హాస్టల్ లోకి బయట ఆహారం తీసుకురానివ్వొదని ఆదేశించారు. విద్యార్థినులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్ నుంచి బయటకు వెళ్లనీయొద్దని మంత్రి సవిత ఆదేశించారు.

Comments

-Advertisement-