-Advertisement-

రాష్ట్రవ్యాప్తంగా 53 బార్లకు నోటిఫికేషన్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

రాష్ట్రవ్యాప్తంగా 53 బార్లకు నోటిఫికేషన్ 


రాష్ట్రంలో సంవత్సర కాలపరిమితితో రాష్ట్రవ్యాప్తంగా 53 బార్ల లైసెన్స్ ల కొరకు వేలము ద్వారా మంజూరు చేయనున్నట్లు మద్యనిషేద మరియు అబ్కారీ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్, ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఒక సంవత్సర కాల పరిమితితో గల బార్ల లైసెన్స్ లను అనగా 01.12.2024 నుండి 31.08.2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 బార్లకు వేలము నిర్వహిస్తున్నామని ఆసక్తి గల ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొనాలని కోరారు. లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరియు బిడ్ అమౌంట్ ను చెల్లించడంలో ఎవరైతే విఫలమయ్యారో వారి బార్లను వేలం ద్వారా ఔత్సాహికులకు ఇవ్వనున్నామన్నారు. బార్ల కేటాయింపు పూర్తిగా ఈ వేలం మరియు ఆన్ లైన్ లాటరీ పద్దతిలో జరుగుతుందన్నారు. 

బార్ల లైసెన్స్ ల కొరకు అభ్యర్థులు 16-12-2024 వ తేదీ నుండి వారి పేర్లను నమోదు మరియు రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలని కోరారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 22-12-2024 తో ముగుస్తుందన్నారు. 50వేల జనాభా వరకు రూ. 5లక్షలు, 50వేల పైన 5 లక్షల లోపు జనాభా వరకు రూ. 7.5 లక్షలు, 5లక్షల జనాభా పైన ఉన్న నగరాలకు రూ. 10లక్షలు దరఖాస్తు రుసుంను(నాన్ రిఫండబుల్) ఈ నెల 23వ తారీఖు లోపు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ నెల 24-12-2024న ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా హెచ్చు మొత్తంలో పాడుకున్న అభ్యర్థికి సదరు బార్ ను కేటాయించడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. వెబ్ సైట్ http://apcpe.aptonline.in , మరింత సమాచారం కొరకు 8074396416 నెంబర్ ను సంప్రదించాల్సిందిగా సూచించారు. 

Comments

-Advertisement-