-Advertisement-

శ్రీ‌వారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడే 'మార్చి 2025' దర్శన టికెట్ల విడుదల

TTD Arjitha Seva Tickets for March 2025 SRIVARI ARJITHA SEVA TICKET RELEASE TTD tickets online TTD Darshanam tickets in online TTD News General News
Peoples Motivation

శ్రీ‌వారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడే 'మార్చి 2025' దర్శన టికెట్ల విడుదల

తమ ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఆ ఏడు కొండలపై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్లాది మంది భక్తులు తపిస్తుంటారు. అలాగే తిరుమలలో నిర్వహించే ప్రత్యేక సేవల్లో పాల్గొనేందుకు శ్రీవారి భక్తులు ఆసక్తి చూపుతారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

నేటి నుంచే విడుదల: 

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మార్చి 2025కు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ రోజు (18వ తేదీ) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలోనే లక్కీ డిప్‌ కోటా కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. బీ ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచుతారు.

ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం కోటా, ఉదయం 11 గంటలకు శ్రీ వాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల ఉంటుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు మార్చి 2025 ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయలు టికెట్ల కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ ఉంటుంది. బీ ఈ నెల 27న మార్చి నెల శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తారు. భక్తులు గమనించి https://ttdevasthanams.ap.gov.in లో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.

Comments

-Advertisement-