-Advertisement-

TSPSC Group-3: గ్రూప్‌-3 హాల్‌టికెట్లు విడుదల.. 17, 18 తేదీల్లో పరీక్షలు

TGPSC Group3 tspsc.gov.in results tspsc login tspsc group 1 tspsc departmental test tspsc departmental test apply online tspsc id tspsc.gov.in TSPSC
Peoples Motivation

TSPSC Group-3: గ్రూప్‌-3 హాల్‌టికెట్లు విడుదల.. 17, 18 తేదీల్లో పరీక్షలు 

గ్రూప్‌-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి.. 

ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహణ..

తాజాగా హాల్‌టికెట్లను విడుదల..

TGPSC Group3 tspsc.gov.in results tspsc login tspsc group 1 tspsc departmental test tspsc departmental test apply online tspsc id tspsc.gov.in TSPSC

గ్రూప్‌-3 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు HTTPS://WWW.TSPSC.GOV.IN నుంచి హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. నవంబర్‌ 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. అలాగే నవంబర్‌ 18న పేపర్‌-3 పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 1,388 ఖాళీలు భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష విధానం ఇలా..

ఈ టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-2లో హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అలాగే.. పేపర్‌-3లో ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

Comments

-Advertisement-