-Advertisement-

TGPSC: అభ్యర్థులకు గమనిక.. గ్రూప్ 2 రాత పరీక్షల షెడ్యూల్ విడుదల

Peoples Motivation

TGPSC: అభ్యర్థులకు గమనిక.. గ్రూప్ 2 రాత పరీక్షల షెడ్యూల్ విడుదల

• డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలు..

• డిసెంబర్ 9నుంచి 15వరకూ హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం..

• పరీక్షలు రాసే అభ్యర్థులకు నియమ నిబంధనలు..

• అధికారిక ప్రకటన విడుదల చేసిన టీజీపీఎస్సీ..

TSPSC Group 2 Notification TSPSC Group 2 Syllabus TSPSC Group 2 exam Date TSPSC Group 2 Notification 2024 TSPSC Group 3 TSPSC Group 2 exam Date 2024 TSPSC Group 2 Notification PDF

రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి డిసెంబరు 15,16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు డిసెంబరు 9 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్, సూచనలతో కూడిన వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచారు. ప్రతి పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. అలాగే 150 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్షల తేదీ, సమయం వివరాలు..

డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. అలాగే డిసెంబరు 16వ తేదీ ఇదే సమయాల్లో పేపర్ 3,4 నిర్వహించనున్నారు.


పరీక్ష రాసే అభ్యర్థులకు నియమ- నిబంధనలు..

  • పరీక్ష ప్రారంభం అయ్యే సమయం కంటే అరగంట ముందే గేట్లు మూసివేస్తారు.
  • ఉదయం నిర్వహించే పరీక్షకు ఉదయం 9.30 గంటలు తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
  • అలాగే మధ్యాహ్నం నిర్వహించే పరీక్షకు 2.30 గంటల తరవాత అభ్యర్థులెవరనీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
  • అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తారు.
  • ఈ మేరకు ఓ నమూనా ఓఎంఆర్ షీట్లు, సూచనలు వెబ్సైట్లలో పొందుపరిచారు.
  • పేపర్-1 పరీక్ష రాసిన హాల్ టికెట్తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలి.
  • హాల్ టికెట్, ప్రశ్నపత్రాలు నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రపరచుకోవాలి. వాటిని అడిగినప్పుడు సమర్పించాలి.
  • అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో సమాధానాలు తప్పులు లేకుండా రాయాలి.
  • హాల్టికెట్లు డిసెంబరు 9 నుంచి 15వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • తర్వాత ఎటువంటి డూప్లికేట్ హాల్టికెట్లు జారీ చేయరు.

ఏదైనా సాంకేతిక సమస్యల కొరకు హెల్లైన్ నెంబర్లు..

హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు కాల్ చేయాలి. ఈ నంబర్లు కేవలం కమిషన్ పనిదినాల్లో అంటే ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయాలి. లేదా Helpdesk@tspsc.gov.in చిరునామాకు ఈ-మెయిల్‌ చేసిన సరిపోతుంది.

గమనిక 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా శాంపిల్ ఓఎంఆర్ షీట్ను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ నుంచి ఆ ఓఎంఆర్ షీట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అసలైన ఓఎంఆర్ షీట్లో ఉండే నిబంధనలు ఇందులో ఉంటాయి. ఈ ప్రకటన టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా రిలీజ్ చేయబడింది. డూప్లికేట్ ప్రకటనలు చూసి మోసపోవద్దు.

Comments

-Advertisement-