-Advertisement-

TG TET: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తగ్గిన టెట్ అప్లికేషన్ ఫీజు, పూర్తి వివరాలు

tstet tsat online classes ts tet hall ticket number forgot tstet.cgg.gov.in results ts tet notification 2024 pdf download schooledu.telangana.gov.in
Peoples Motivation

TG TET: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తగ్గిన టెట్ అప్లికేషన్ ఫీజు, పూర్తి వివరాలు

• టెట్‌ పరీక్ష ఫీజును తగ్గించిన ప్రభుత్వం..

• ఒక పేపరుకు రూ. వెయ్యిగా ఉన్న ఫీజును రూ.750కి తగ్గింపు.. 

• రెండు పేపర్లకు రూ. 2వేలుగా ఉన్న ఫీజును రూ. వెయ్యికి తగ్గింపు..

• ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 7 నుంచి ప్రారంభం..

• జనవరి 1 నుంచి 20 మధ్య ఉపాధ్యాయ అర్హత పరీక్షలు..

tstet tsat online classes ts tet hall ticket number forgot tstet.cgg.gov.in results ts tet notification 2024 pdf download schooledu.telangana.gov.in
TG TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2024-25)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 20 వరకు వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఆన్లైన్ ఆధారిత టెట్ పరీక్ష జనవరి 1 నుంచి 20తేదీల మధ్య నిర్వహిస్తారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు; సెకెండ్ సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనున్నాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు టెట్ 2024-25కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 

తెలంగాణలో టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేవారికి గుడ్ న్యూస్..

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్ష ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. టెట్ ఒక పేపరుకు(పేపర్-1 లేదా పేపర్-2) రూ.1000గా ఉన్న ఫీజును 750 రూపాయలకు తగ్గించింది. రెండు పేపర్లకు రూ.2వేలుగా ఉన్న పరీక్ష ఫీజును రూ.1000 తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల మేలో టెట్ ఎగ్జామ్ రాసి అర్హత సాధించని వారికి ఫీజునుంచి మినహాయింపునిచ్చింది.గురువారం రాత్రి 11 గంటల నుంచి టెట్ దరఖాస్తు ప్రక్రియు ప్రారంభమైంది. సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 5న ప్రారంభం కావాల్సిన ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవ్వగా పరీక్ష ఫీజును తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిరుపేద, మధ్య తరగతి టెట్ అభ్యర్థులకు మేలు జరగనుంది.

7వ సారి టెట్:

పాఠశాల విద్యాశాఖ అఫీషియల్ వెబ్సైట్లో మరింత సమాచారం ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే అందులో చెక్‌ చేసుకోవచ్చు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ఇంతకు ముందే తెలిపిన విషయం విధితమే. ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ పరీక్షను నిర్వహించగా మరో మారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆరు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించగా జనవరిలో జరిగేది 7సారి కానుంది.

ఏడాదిలోపే రెండోసారి టెట్‌ నోటిఫికేషన్‌:

టెట్‌ ఎగ్జామ్ పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. స్కూల్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్(పదోన్నతి) పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని చెబుతుండటం వల్ల వేల మంది ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడా ఎగ్జామ్ రాయనున్నారు. టెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు పరీక్షలు పెట్టగా జనవరిలో 10వ సారి జరగనుంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావించిన తర్వాత గతేడాది మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం గమనార్హం.

ముఖ్యమైన తేదీలు:

టెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 7 నుంచి 20వరకు

హాల్ టికెట్ల డౌన్లోడ్: డిసెంబర్ 26 నుంచి

• పరీక్ష తేదీలు: జనవరి 1 నుంచి 20 మధ్య

• ఫలితాలు: ఫిబ్రవరి 5న

దరఖాస్తు కోసం క్లిక్ చేయండి

Comments

-Advertisement-