-Advertisement-

RRB Exams: అభ్యర్థులకు శుభవార్త‌.. ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

RRB Latest updates Upcoming Railway Exams 2024 List of Railway exams RRB official website RRB exam syllabus Railway exam eligibility Railway Exam Date
Peoples Motivation

RRB Exams: అభ్యర్థులకు శుభవార్త‌.. ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో జరుగనున్న ఆర్‌ఆర్‌బీ అర్హత పరీక్షల అభ్యర్థుల కోసం ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్‌వో శ్రీధర్‌(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.

RRB Latest updates Upcoming Railway Exams 2024 List of Railway exams RRB official website RRB exam syllabus Railway exam eligibility Railway Exam Date

దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో జరుగనున్న ఆర్‌ఆర్‌బీ అర్హత పరీక్షల అభ్యర్థుల కోసం ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్‌వో శ్రీధర్‌(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు:

గుంటూరు-సికింద్రాబాద్(Guntur-Secunderabad),

కరీంనగర్‌-కాచిగూడ (Karimnagar-Kacheguda),

కాచిగూడ-కర్నూలు సిటీ(Kacheguda-Kurnool City),

హుబ్లీ-కర్నూలు సిటీ (Hubli- Kurnool City), 

నాందేడ్‌-తిరుపతి(Nanded-Tirupati), 

కాకినాడటౌన్‌-తిరుపతి (Kakinada - Tirupati) మధ్య రైళ్లు నడుపుతామని తెలిపారు.

• నాందేడ్‌-తిరుపతి మధ్య 23న ప్రత్యేక రైలు(07105) నాందేడ్‌లో మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి ముడికేడ్‌, ధర్మాబాదు, నిజామాబాద్‌, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూల్‌సిటీ, డోన్‌, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్డు, పాకాల స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

• తిరుపతిలో ప్రత్యేక రైలు (07106) 24వ తేదీ మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ మరుసటి రోజు 8.35 గంటలకు నాందేడ్‌ చేరుకుంటుంది.

• కాకినాడటౌన్‌లో 23వ తేదీ ప్రత్యేక రైలు(07107) ఉదయం 6.30 గంటలకు బయలుదేరి సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూగుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా అదేరోజు సాయంత్రం 6.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

• తిరుపతిలో 24వ తేదీ ప్రత్యేక రైలు(07108) రాత్రి 7.45 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలో ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాకినాడటౌన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 23, 24 తేదీలతో పాటు 26, 28, 29 తేదీలలో రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.

Comments

-Advertisement-