Mudra Loan: ప్రధానమంత్రి ముద్రా యోజన రుణాల పరిమితి పెంపు ఇలా..!!
Mudra Loan: ప్రధానమంత్రి ముద్రా యోజన రుణాల పరిమితి పెంపు ఇలా..!!
దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు ప్రధానమంత్రి ముద్రా యోజన(పీఎమ్ ఎమ్) కింద ఇచ్చే రుణాల పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించడంతో ఇటీవల కేంద్రప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో ఎవరికి ప్రయోజనం:
ఇంతకుముందు 'తరుణ్' విభాగం కింద రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించిన వారికి ఈ రుణ పరిమితి పెంపు వర్తిస్తుంది. ఈ రుణాలకు హామీ కవరేజీని క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ (సీజీఎఫ్ఎమ్ఎయూ) కింద అందజేస్తారు.
ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి:
ఈ పథకం ప్రధాన లక్ష్యం:
కార్పొరేట్యేతర, వ్యవసాయేతర సూక్ష్మ, చిన్న తరహా సంస్థల స్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం 2015లో ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎమ్ఎమ్ఎ్వ)ని కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో మొత్తం 3 రకాల రుణాలు ఉంటాయి.
అవి: శిశు, కిశోర, తరుణ్
👉శిశు రుణాల కింద రూ.50 వేల వరకు
👉కిశోర రుణాల కింద రూ.50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు
👉ఇప్పుడు తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీ తీసుకొచ్చి.. దీని కిందనే రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ముద్ర లోన్ వడ్డీ , రేట్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి... ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15 శాతం నుంచి 12.80 శాతం వరకు; ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంకుల్లో 6.96 శాతం నుంచి గరిష్టంగా 28 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. ఇతర సాధారణ లోన్ల కంటే మాత్రం వీటిల్లో వడ్డీ రేట్లు కాస్త తక్కువే ఉంటాయి.
MUDRA అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్..
కొత్తగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారి కోసం, వ్యాపార విస్తరణ కోసం కూడా లోన్లు వస్తాయి. ఎలాంటి తనఖా/ష్యూరిటీ లేకుండానే లోన్లు మంజూరు చేయబడతాయి.
మాన్యుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ వంటి రంగాల్లో ఉన్నవారెవరైనా భారతీయులకు ఈ లోన్లు వస్తాయి. పండ్లు, కూరగాయలు అమ్మేవారికి, మెషీన్ ఆపరేటర్స్, రిపేయిర్ షాప్స్, చేతివృత్తుల వారు కూడా లోన్లు పొందొచ్చు.
ఈ పథకం కింద మహిళా లబ్దిదారులే దాదాపు 60 శాతానికిపైగా ఉన్నారు.