-Advertisement-

JEE: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఇప్పటి నుంచి మూడేళ్లు జేఈఈ పరీక్షలకు అవకాశం

NTA JEE Mains registration NTA JEE Mains 2025 syllabus NTA JEE Mains Result 2024 NTA JEE Advanced NTA JEE Mains results NTA JEE Mains login NTA JEE
Peoples Motivation

JEE: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఇప్పటి నుంచి మూడేళ్లు జేఈఈ పరీక్షలకు అవకాశం

• జేఈఈ పరీక్ష రాస్తున్నారా ఐతే ఈ లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాల్సిందే..

• 2023 మార్చిలో ఇంటర్‌ ఉత్తీర్ణులకు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం..

• ఇప్పటి వరకు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం..

• ఇప్పటి నుంచి మూడేళ్లు రాసుకోవచ్చని ప్రకటన..

• 2025 నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పూర్‌..

NTA JEE Mains registration NTA JEE Mains 2025 syllabus NTA JEE Mains Result 2024 NTA JEE Advanced NTA JEE Mains results NTA JEE Mains login NTA JEE

కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో బీటెక్ సీట్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇప్పటి వరకు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉండగా ఇప్పటి నుంచి మూడేళ్లు రాసుకోవచ్చని తెలిపింది. దీంతో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ పాసైన వారికి కూడా ఈసారి ఈ పరీక్ష రాసేందుకు వీలు ఉంటుంది. అడ్వాన్స్‌డ్- 2025 నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పూర్‌ ఈ సంస్థ మంగళవారం ప్రకటించింది.

వారు మాత్రమే అర్హులు..

2000 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే 2025 అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హులని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల మినహాయింపు కూడా ఇచ్చారు. ఈ వర్గాల్లో 1995 అక్టోబరు 1వ తేదీ లేదా ఆ తర్వాత పుట్టిన వారు కూడా ఈ పరీక్ష రాసుకోగా. సిలబస్‌లో ఎటువంటి మార్పు లేదని, జేఈఈ మెయిన్‌లో స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసుకోవచ్చని ఐఐటీ కాన్పూర్‌ వివరించింది. మే మూడు లేదా నాలుగో వారంలో ఈ పరీక్ష నిర్వహించబడింది.

ఒలింపియాడ్‌ విద్యార్థులకు సీటు కేటాయిస్తారా..

అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న విద్యార్థులకు జేఈ అడ్వాన్స్‌డ్‌తో సంబంధం లేకుండా ఐఐటీ కాన్పుర్‌లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్ సైన్స్ (బీఎస్‌) సీట్లు ప్రకటించాలని కోరింది. గణితం, ఇన్‌ఫర్మేటిక్స్‌ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి సీఎస్‌ఈలో ఆరు సీట్లు కేటాయిస్తారు. కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌లు, మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, బయలాజికల్‌ సైన్సెస్‌ బయో ఇంజినీరింగ్‌ అండ్‌ విభాగాల్లో సీట్లు కేటాయిస్తుంది. ఈ సీట్లకు మార్చి మొదటి వారంలో దరఖాస్తులు ఆహ్వానించారు. జోసా కౌన్సెలింగ్ కంటే ముందుగానే ఈ ప్రవేశాలను పూర్తి చేస్తారు. ఇప్పటికే ఉన్న సీట్ల నుంచే ఒలింపియాడ్‌ విద్యార్థులకు కేటాయిస్తారా? సూపర్ న్యూమరరీ కింద అదనపు సీట్లు అందిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Comments

-Advertisement-