-Advertisement-

Inter: ఇంటర్ విద్యార్థులకు గమనిక: 2025 మార్చిలో పరీక్షలు.. ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు తేదీల ప్రకటన

Inter exams 2025 TS Intermediate exam Time Table 2025 1st year Inter Exam Time Table 2025 Intermediate Exam Date 2025 in AP Inter exam Date 2025 Inter
Peoples Motivation

Inter: ఇంటర్ విద్యార్థులకు గమనిక: 2025 మార్చిలో పరీక్షలు.. ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు తేదీల ప్రకటన

• ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ప్రకటించిన బోర్డున..

• 2025 మార్చిలో జరగనున్న ఇంటర్ పరీక్షలు..

• నవంబర్ 6 నుంచి 26 వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశం..

Inter exams 2025 TS Intermediate exam Time Table 2025 1st year Inter Exam Time Table 2025 Intermediate Exam Date 2025 in AP Inter exam Date 2025 Inter

పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. తెలంగాణలో ఇంటర్ మొదటి, రెండో ఏడాదికి సంబంధించి  నవంబర్ 6 నుంచి 26 వరకు ఎగ్జామ్ ఫీజులను చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. 100 రూపాయల అపరాధ రుసుముతో(ఫైన్) నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.అదే విధంగా ఇంటర్ మొదటి, రెండో ఏడాదిలకు సంబంధించి పరీక్ష ఫీజుల వివరాలను కూడా వెల్లడించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులకు రూ.520, ఒకేషనల్ విభాగం వారు రూ.750 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ ఆర్ట్స్ విభాగం వారు రూ.520 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్ వారు రూ.750, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలి.

ఇంటర్ పరీక్షల ఫీజులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం

• పరీక్ష ఫీజు చెల్లించేందుకు ముఖ్యమైన తేదీలు: నవంబర్ 6 నుంచి 26 వరకు 

• 100 రూపాయల ఫైన్ తో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు

• ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులకు : రూ.520 చెల్లించాలి

• ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు : రూ.750 చెల్లించాలి

• ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు : రూ.520

• ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ వారు : రూ. 750

• ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు : రూ.750

Comments

-Advertisement-