HIV AIDS: షాకింగ్ న్యూస్.. ఒక టీనేజీ అమ్మాయి ద్వారా ఏకంగా 19 మందికి హెచ్ఐవీ
HIV AIDS: షాకింగ్ న్యూస్.. ఒక టీనేజీ అమ్మాయి ద్వారా ఏకంగా 19 మందికి హెచ్ఐవీ
• ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఘటన..
• హెరాయిన్‌కు బానిసైన యువతి..
• కొనుక్కునేందుకు తనకు సాయం చేసిన వారితో శారీరక సంబంధం..
• యువకులు అనారోగ్యం బారినపడటంతో విషయం వెలుగులోకి..
• అలెర్టైన ప్రభుత్వం..
‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంచలన కథనం వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఒకే అమ్మాయి ద్వారా 19 మంది అబ్బాయిలు ఎయిడ్స్ (హెచ్ఐవీ) బారినపడినట్టు 17 ఏళ్ల అమ్మాయి హెరాయిన్‌కు బానిసై డ్రగ్స్ కోసం తనకు సాయం చేసిన అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఫలితంగా ఆమె ద్వారా వారంతా ఎయిడ్స్ బారినపడ్డారు. ఇది కలవరపెట్టే ధోరణి అని, తాము చర్యలు తీసుకున్నట్టు జిల్లా వైద్యాధికారి ఒకరు తెలిపారు. అమ్మాయి అలవాటు ఈ విపత్కర పరిస్థితికి దారితీసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎలా గుర్తించారు..
నైనిటాల్‌లో ఒక్కసారిగా హెచ్ఐవీ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. యువకులు అనారోగ్యం బారినపడడంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వారికి హెచ్ఐవీ సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం వారికి రామ్‌దత్ జోషి జాయింట్ ఆసుపత్రిలోని ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ)లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసైన యువతికి డబ్బులు సాయం చేసిన యువకులు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, వీరు కాకుండా మరెంతోమంది ఆమె దగ్గర ఎయిడ్స్ బారినపడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఏడాదికి దాదాపు 20 హెచ్ఐవీ పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని, కానీ, కేవలం 5 నెలల్లోనే 19 కేసులు వెలుగు చూడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని నైనిటాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హరీశ్ చంద్ర పంత్ తెలిపారు. రామ్‌నగర్‌లో గత 17 నెలల్లో ఏకంగా 45 మంది హెచ్ఐవీ బారినపడినట్టు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.