Custard Apple: చలికాలంలో దొరికే సీతాఫలం ప్రత్యేకతలెన్నో!!
Custard Apple: చలికాలంలో దొరికే సీతాఫలం ప్రత్యేకతలెన్నో!!
సీతాఫలాలలో ఉండే పోషకాలేంటి?
సీతాఫలాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. పండ్లలో సీజన్ వారిగా లభించే పండ్లకు చాలా ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వాటిలో సీతాఫలం కూడా ఒకటి. కస్టర్డ్ యాపిల్ అని పిలిచే సీతాఫలాలు మిస్ కాకుండా తింటే ఈ లాభాలన్నీ సొంతం..
సీజన్ వారిగా కనువిందు చేసే పండ్లలో సీతాఫలానికి చాలా ప్రత్యేకత ఉంది. బాగా పండిన సీతాఫలం లోపల తియ్యని గుజ్జుతో నల్లని విత్తనాలతో మధురమైన రుచిని కలిగి ఉంటుంది. సహజంగా పండిన సీతాఫలాల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే.. శీతాకాలంలో మాత్రమే కాసే సీతాఫలాల కోసం ఏడాది మొత్తం ఎదురు చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. మామిడి పండ్లకు ఏమాత్రం తీసిపోసి క్రేజ్ సీతాఫలాలది. కేవలం రుచినే కాదు.. ఆరోగ్యాన్ని చేకూర్చడంలో కూడా సీతాఫలం ఒక మెట్టు పైనే ఉంటుంది. సీతాఫలాలలో ఉండే పోషకాలేంటి? సీతాఫలాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే...
సీతాఫలం లో పోషకాలు..
సీతాఫలాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి. ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ మెరుగ్గా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి.
సీతాఫలం తో ప్రయోజనాలు..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్-సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతాయి.
సీతాఫలాలలో యాంటీ ఆక్సిడెంట్ అయిన కెరోటినాయిడ్ ఉంటుంది. దీన్ని లుటిన్ అని పిలుస్తారు. ఇది చిన్నతనంలోనే దృష్టిలోపాలు, కళ్లలో మచ్చలు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తగ్గిచండలో సహాయపడుతుంది. లుటిన్ సమృద్దిగా తీసుకుంటే కంటిశుక్లం ప్రమాదం తగ్గుతుంది.
బరువు పెరిగేవారికి సీతాఫలం మంచిది. వేగంగా పెరుగుతున్న బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉంటే విటమిన్-ఎ, సి, బి6 వంటి విటమిన్లు.. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు.. కూడా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటంలో సహాయపడుతుంది. తద్వారా బరువు పెరగకుండా చేస్తుంది.
సీతాఫలాలలో ఫైబర్ సమృద్దిగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచిది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది. సీతాఫలాన్ని తీసుకుంటే పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. కిణ్వ ప్రక్రియ ద్వారా శరీరంలో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయి. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.