-Advertisement-

తస్మాత్ జాగ్రత్త: సమగ్ర సర్వే అంటూ... ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే సంగతి!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

తస్మాత్ జాగ్రత్త: సమగ్ర సర్వే అంటూ... ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే సంగతి!

మొబైల్ కు ఇలాంటి లింక్ వస్తే క్లిక్ చేయొద్దంటున్న పోలీసులు..

సర్వే పేరుతో ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని హెచ్చరిక..

అధికారులే నేరుగా ఇంటికి వచ్చి సర్వే చేస్తారని వెల్లడి..

సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్‌ నేరగాళ్ల కన్ను..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

ఇటీవల సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు. కష్టపడి కొందరు, వడ్డీలకు డబ్బులిచ్చి మరికొందరు. సైబర్ నేరగాళ్లు డబ్బుల కోసం నిరుద్యోగులను, అమాయక ప్రజలను తమ వలలో పడేంత వరకు మాటలు మాట్లాడి నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆతరువాత డబ్బులను దోచుకునే పనిలో పడతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్‌ నేరగాళ్ల కన్ను పడింది. ఆన్‌లైన్‌లో సర్వే, డిజిటల్‌గా కొన్ని పత్రాలు పంపాలంటూ నేరస్థులు మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వేలో భాగంగా కాల్‌ చేశామని, అడిగిన పత్రాలు ఇవ్వాలంటూ కాల్స్‌ వస్తున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

రోజంతా ఆఫీసులో కూర్చొని.. ఇలా అందరూ ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ.. ఇళ్ల మీద పడి డబ్బులు, నగలు దోచుకెళ్లడం ఓల్డ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఇటీవల మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులకు పరిహారం పేరుతో మోసగించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని కొందరికి ఏపీకే ఫైళ్లు పంపించారు. నేరగాళ్లు ఇప్పుడు కుటుంబ సర్వేను అస్త్రంగా మార్చుకున్నారు. ఈ తరహా మోసాలపై ఇప్పటివరకూ కేసులు నమోదవ్వకున్నా సర్వే పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్, సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇళ్లకు వచ్చి మాత్రమే వివరాలు నమోదు చేసుకుంటారు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. పని ఒత్తిడి, వ్యాపారంతో తీరిక లేకుండా ఉండడం, ఇతర ప్రాంతాల్లో పర్యటనల దృష్ట్యా సర్వే ఎప్పుడు పూర్తవుతుందోనని కొందరు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారినే సైబర్‌ ముఠాలు లక్ష్యంగా చేసుకునే అవకాశముంది.

అనుమానాస్పద లింకులపై, APK పైల్స్ పై క్లిక్ చేయవద్దు::

నేరగాళ్లు కుటుంబ సర్వేలో భాగంగా కాల్‌ చేస్తున్నామని.. ఆధార్, పాన్‌ తదితర గుర్తింపు పత్రాలు పంపాలని లేకపోతే తాము పంపించే లింకును క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని నమ్మిస్తారని పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్‌కు వెబ్‌లింకులు, ఏపీకే(ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ) ఫైల్‌ పంపిస్తారని.. గూగుల్‌ ప్లేస్టోర్, ఐస్టోర్‌లో లేని యాప్‌లనే ఏపీకే ఫైళ్ల ద్వారా పంపిస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నిజమేనని నమ్మి వీటిని క్లిక్‌ చేస్తే ప్రమాదకర యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయని తెలిపారు. తద్వారా ఫోన్‌ పూర్తిగా నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లి ఫొటోలు, బ్యాంకు ఖాతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి మనకు వచ్చే కాల్స్‌ను కూడా నేరస్థులు వినొచ్చన్నారు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కొట్టేయడం, వ్యక్తిగత ఫోటోలతో బెదిరింపులకు దిగడం వంటివి జరుగుతాయన్నారు. ఒక వేళ సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేసినా.. మోసపోయినా వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదుచేయాలని సూచిస్తున్నారు.

అంతేకాదు.. తాజాగా సైబర్ కేటుగాళ్లు రాజకీయ, పోలీసుల వాట్సప్ డీపీ ఫోటోలు పెట్టి కూడా ప్రజలను భయపెట్టి డబ్బులను గుంజుకున్న దాఖలాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమగ్ర సర్వే పేరుతో ఎవరైనా ఫోన్ చేసినా, లింక్ లు పంపినా నమ్మవద్దని తెలిపారు. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దని ముందగానే రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు.

గమనిక: సమగ్ర సర్వే సిబ్బంది ఎలాంటి పత్రాలు తీసుకోరు

• సమగ్ర సర్వే సిబ్బంది నేరుగా ఇళ్లకే వచ్చి సమగ్ర వివరాలు నమోదు చేసుకుంటారు..

• రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్‌ కార్డులతో సహా ఎలాంటి ధ్రువీకరణ డాక్యుమెంట్లనూ తీసుకోరు.

• ఎలాంటి ఫొటోలు అడగరు.. కెమెరాతో ఎటువంటి సమాచారాన్ని చిత్రీకరించరు.

• ఆధార్‌ కార్డు అనుసంధానం అంటూ మెషిన్లు తీసుకొచ్చి వేలిముద్రలు సేకరిస్తామంటే అసలు నమ్మొద్దు.

• ఎవరైనా ఫోన్‌ చేసి ఆయా వివరాలు అడిగితే మోసమని అలర్ట్ అవ్వాల్సిందే.

• సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేసినా, మోసపోయినా వెంటనే ‘1930’ సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించి కంప్లైంట్ చేయాలి. 

Comments

-Advertisement-