చిత్తవుతున్న పత్తి రైతులు.. అందని ద్రాక్షలా గిట్టుబాటు ధరలు.. దళారీలను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
చిత్తవుతున్న పత్తి రైతులు.. అందని ద్రాక్షలా గిట్టుబాటు ధరలు.. దళారీలను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
జిల్లాలో పత్తి రైతులు చిత్తవుతున్నారు. మద్దతు ధర లభించక విలవిల్లాడుతున్నారు. రైతులు అనివార్యంగా ప్రవేటు వ్యాపారులకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పత్తి పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందని ద్రాక్షలా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో క్వింటాకు వెయ్యి రూపాయల వరకు నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏటా ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోలు. చేపట్టేది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాలూరు ఎఎంసి యార్డులో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే అవకాశం వుండేది. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చేతులెత్తేసింది. దీంతో జిల్లాలో సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, పార్వతీపురం, బల్జిపేట, కురుపాం, పాలకొండ, సీతంపేట మండలాల్లో సుమారు 12వేల ఎకరాల్లో పత్తి సాగతువుంది, దిగుబడి సుమారు 20వేల క్వింటాళ్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పొడవు గింజ పత్తి క్వింటాలుకు రూ.7600, పార్టీ గింజ పత్తి రూ.7120కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు నాణ్యతపై రకరకాల కారణాలతో పత్తి క్వింటాకు రూ.6200 నుంచి రూ.6400 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు వెయ్యి రూపాయల వరకు నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకటనలకే పరిమితమైంది. రైతుల కాయకష్టం దళారుల బోజ్యం గా మారింది, పెట్టుబడి డబ్బులు కూడా రాని పరిస్థితిరైతులు ప్రస్తుతం పత్తి ఏరివేత పనుల్లో వున్నారు. మొదటి విడత ఏరివేత అయిన తరువాత అమ్ముకోవాల్సిన పరిస్థితి వుంది. ఎకరా పత్తి సాగుకు రైతులు సుమారు రూ.25 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దుక్కి నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు, పండించిన తర్వాత ఏరివేత, రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎకరా భూమిలో నాలుగు క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం చూస్తే రైతులు పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా దాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మద్దతు ధర లభిస్తే ఎకరానికి రూ. గివేల నుంచి రూ. పదివేల వరకు. ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మద్దతు ధర లభించక పోతే తమ కష్టం దళారీల పాలయినట్లేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాటన్ జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కురామభద్రపురం మండలంలోని ముచ్చర్లవలస గ్రామంలో నందిని కాటన్ జిన్నింగ్ మిల్లు వుంది. గత కొన్నేళ్లుగా ఈ మిల్లు యాజమాన్యం పత్తి రైతులను అడ్డగోలుగా దోపిడీ చేస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్, సిసిఐ అధికారులు జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కై రైతులకు మద్దతు ధర అందకుండా చేస్తున్నారనే ఆరోపణలు. బలంగా వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు సాలూరు ఎఎంసి యార్డ్తో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేది, అయితే గత రెండేళ్లుగా సిసిఐ కొనుగోలు కేంద్రం జిన్నింగ్ మిల్లు వద్దనే ఏర్పాటు చేసి రైతులను దోపిడీకి గురి చేస్తోంది. మన్యం జిల్లాలో పత్తి స చేస్తున్న సుదూర మండలాలైన పాలకొండ, సీతంపేట, భామిని, కొమరాడ, కురుపాం నుంచి కూడా పత్రిని జిన్నింగ్ మిల్లు వద్దకే తీసుకొచ్చి అమ్ము కోవాల్సిన పరిస్థితిని అధికారులు కల్పిస్తున్నారు. 50 నుంచి వంద కిలోమీటర్ల దూరం నుంచి పత్తిని రైతులు తీసుకురావడం కష్టమైన పనిగా భావిస్తున్నారు. దీంతో నష్టానికైనా వ్యాపారులకి తెగనమ్ముకొంటున్నారు. జిన్నింగ్ మిల్లు యజమాని కూడా కమిషన్ ఏజెంట్లను నియమించుకుని గ్రామాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.