-Advertisement-

ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో దారుణం.. శవానికి చికిత్స పేరుతో రూ. లక్షలు వసూలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో దారుణం.. శవానికి చికిత్స పేరుతో రూ. లక్షలు వసూలు

-డబ్బు కట్టిన తర్వాత కాసేపటికే రోగి చనిపోయిందని వైద్యుల వెల్లడి..

-ఇప్పటికే 3 లక్షలు కట్టామని, మరో లక్ష కట్టాలని బెదిరించారని బంధువుల ఆరోపణ..

-డబ్బు కోసమే మరణించిన విషయం దాచిపెట్టారని ఆందోళన..

-చనిపోయిన మహిళ కూడా ఓ డాక్టరేనని వెల్లడి..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

హైదరాబాద్ మాదాపూర్‌‌లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ సీన్ రిపీట్ అయింది. రోగి మృతి చెందినా చికిత్స చేస్తున్నామంటూ ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. రోగి చికిత్స కోసం అప్పటికే రూ.7 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే మరో రూ. 3 లక్షల 80 వేలను చెల్లించాలని లేకపోతే వారి కుమార్తెకు చికిత్స ఆపేస్తామని డాక్టర్లు ఒత్తిడి చేసినట్లు తెలిసింది.

ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ చేశారు...

ఠాగూర్ సినిమాలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శవానికి చేసి హీరో రోగి వద్ద రూ.లక్షలు వసూలు చేసిన సీన్ గుర్తుంది.. సరిగ్గా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కూడా ఇలాంటి సంఘటన జరిగిందా. మంగళవారం రాత్రి చనిపోయిన రోగికి బుధవారం ఉదయం కూడా వైద్యులు చికిత్స చేశారు. ఇప్పటికే రూ.3 లక్షలు కట్టిన బంధువులను చికిత్స ఆపేస్తామని బెదిరించి మరీ మరో లక్ష వసూలు చేశారు. డబ్బులు కట్టిన కాసేపటికే సారీ చెబుతూ డెడ్ బాడీని అప్పగించారు. ఈ ఘటనలో మరో దారుణమైన సంగతేంటంటే.. చికిత్స పొందుతూ చనిపోయింది కూడా ఓ డాక్టరే.. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..

హైదరాబాద్ కు చెందిన జూనియర్ డాక్టర్ నాగప్రియ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అడ్వాన్స్, మందుల చార్జీలు, వైద్య పరీక్షలకు మంగళవారం నాటికే 3 లక్షల రూపాయలు చెల్లించారు. అయితే, మంగళవారం రాత్రి పరిస్థితి విషమించడంతో నాగప్రియ చనిపోయారు. ఈ విషయాన్ని దాచిన డాక్టర్లు.. నాగప్రియకు చికిత్స కొనసాగిస్తున్నట్లు నటించారు.

బుధవారం ఉదయం మరో లక్ష రూపాయలు కట్టాలని, లేదంటే చికిత్స ఆపేయాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో అతికష్టమ్మమీద డాక్టర్లు అడిగిన సొమ్మును నాగప్రియ కుటుంబ సభ్యులు చెల్లించారు. డబ్బు కట్టిన రశీదు చూశాక వైద్యులు తమ నాటకానికి ముగింపు పలికారు. ఎంత ప్రయత్నించినా నాగప్రియ ప్రాణాలను కాపాడలేకపోయామని, డెడ్ బాడీని తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన నాగప్రియ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. డబ్బుల మరణించిందనే విషయం నాగ కోసమే చెప్పకుండా దాచారని.

Comments

-Advertisement-