నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
tstet tsat online classes
ts tet hall ticket number forgot
tstet.cgg.gov.in results
ts tet notification 2024 pdf download
schooledu.telangana.gov.in
By
Peoples Motivation
నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
• ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటాపోటీ..
• గెలుపోటములపై స్వల్ప తేడా అంటున్న విశ్లేషకులు..
• న్యూయార్క్ రాష్ట్రంలో బెంగాలీలోనూ బ్యాలెట్..
ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. నవంబర్ 5న అంటే మంగళవారమే ఓటింగ్ జరుగగనుంది. అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకోగానే ఇప్పుడు అందరి దృష్టి స్వింగ్ స్టేట్స్ పైనే ఉన్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలను మూడు రకాల రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. వీటిని రెడ్, బ్లూ, స్వింగ్ స్టేట్స్ అంటారు. 1980 నుంచి రిపబ్లికన్స్ విజయం సాధిస్తున్న వాటిని రెడ్ స్టేట్స్ అంటారు. అలాగే 1992 నుంచి డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను బ్లూ స్టేట్స్ అంటారు. ఇక స్వింగ్ స్టేట్స్ లో రెండు పార్టీల మధ్య గెలుపోటమలు దోబూచులాడుతాయని భావిస్తారు. ఈసారి ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలువనున్నారు. ఎందుకంటే పోటీ చాలా తీవ్రంగా ఉన్నది. రాయిటర్స్, ఐపిఎస్టఎస్ పోల్ గత వారం అక్టోబర్ 29న ప్రచురించిన దాని ప్రకారం కమలా హారిస్ కే ఆధిక్యత ఉంది. సింగిల్ పర్సంటేజ్ ఆధిక్యతతో డెమోక్రట్లు ఉన్నారు. డెమోక్రాట్లు 44 శాతం, రిపబ్లికన్లు 43 శాతం మేరకు ఓట్లు పొందనున్నారని అంచనా ఓ సర్వే ప్రకారం స్వింగ్ స్టేట్స్ అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెపడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ లలో రిపబ్లికన్ నామినికే మొగ్గు ఉంది. అమెరికాలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త నెట్ సిల్వర్ తాజాగా తన అంచనాలను వెల్లడించారు. ట్రంప్-హారిస్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్నారు. అయితే కొంచెం మొగ్గు మాత్రం రిపబ్లికన్ల వైపే ఉందని చెప్పారు. ఈమేరకు న్యూయార్క్ పోస్టు కథనం ప్రచురించింది. సిల్వర్ మోడల్ అంచనాల ప్రకారం ట్రంప్నకు ఎలక్టోరల్ కాలేజ్లో 51.5 శాతం ఓట్లు లభించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. హారిస్ వైపు 48.1 శాతం మంది మొగ్గు చూపుతున్నారన్నారు. ఈసందర్భంగా నేట్ సిల్వర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ టైమ్స్ స్వింగ్ స్టేట్స్ పోల్స్ హారిస్కు సానుకూలంగా ఉన్నా.. అద్భుతంగా మాత్రం లేవు. అలానే మార్నింగ్ కన్జలెంట్వి ట్రంప్నకు మంచిగానే ఉన్నా.. అమోఘంగా లేవు. ఇది పూర్తిగా హోరాహోరీ పోరే అని విశ్లేషించారు. రిపబ్లికన్లకు పట్టున్న అయోవాలో ట్రంప్ వెనుకంజలో ఉన్నారంటూ సె+-జలెర్ సర్వే శనివారం ప్రకటించడాన్ని నేట్ సిల్వర్ ప్రస్తావించారు. ఆ ఒక్క రాష్ట్రంతో అధ్యక్ష పదవి వచ్చే అవకాశం లేదన్నారు. ఆదివారం ఉదయం వరకు సిల్వర్ తాను చేపట్టిన నేషనల్ పోలింగ్ యావరేజ్ను విడుదల చేశారు. దీనిలో దేశవ్యాప్తంగా చూసుకొంటే హారిస్ కు 48.5శాతం ఓట్లు రాగా.. ట్రంప్నకు 47.6శాతం ఓట్లు లభించాయి. కానీ, స్వింగ్ స్టేట్స్ అయిన నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, నెవడా, జార్జియా, అరిజోనాల్లో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొన్నారు. హారిస్కు మిషిగన్, విస్కాన్సిన్లో ఆధిక్యం చూపుతు న్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ మొదలుకాగా.. నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఓటర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఆయా రాష్టాల్రు వివిధ భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో న్యూయార్క్ రాష్ట్రం ఇంగ్లిష్కు అదనంగా మరో ఐదు భాషల్లో వీటిని ముద్రించగా.. అందులో భారతీయ భాష 'బెంగాలీ' ఉండటం విశేషం. ఎన్నికల పక్రియలో ఇంగ్లిష్ కాకుండా మరో నాలుగు భాషలకు చోటు కల్పించారు. చైనీస్, స్పానిష్, కొరియన్, బెంగాలీ భాషల్లో బ్యాలెట్ అందుబాటులో ఉందని న్యూయార్క్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే రియాన్ పేర్కొన్నారు. ఇక్కడ స్థిరపడిన వారికి ఇంగ్లిష్ తెలిసినప్పటికీ మాతృ భాషలో అందుబాటులో ఉండటం ఆయా ప్రాంతాల వారికి సంతోషకర అంశమన్నారు. అయితే, భారత్లో అనేక భాషలున్నప్పటికీ గతంలో కోర్టులో వేసిన ఓ దావా వల్ల ఎన్నికల పక్రియలో బెంగాలీకి చోటు లభించింది. ఎన్నికల నిర్వహణలో అనేక దేశాలు ఏకీకృత వ్యవస్థను అనుసరిస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఇందుకు భిన్నం. ప్రచార చట్టాలను ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తుండగా.. ఎన్నికల పక్రియను మాత్రం ఆయా రాష్ట్రాలు చూసుకుంటాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సమయం, కౌంటింగ్ పక్రియకు ఆయా రాష్టాల్రు ప్రత్యేక నిబంధనలను పాటిస్తాయి.
Comments