-Advertisement-

ఆందోళనకరంగా.. అత్యాచారాలు, అఘాయిత్యాలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

ఆందోళనకరంగా.. అత్యాచారాలు, అఘాయిత్యాలు

కఠిన శిక్షలతోనే దుండుగులకు చెక్ ప్రజలు అప్రమత్తం కావడమే పరిష్కారం
General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకటి తరవాత మరొకటి అన్నట్లుగా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. మృగాళ్లు భయం లేకుండా విచ్చలవిడిగా తెగబడుతున్నారు. బహిరంగంగా ఉరితీసే వరకు ఇవి ఆగవన్న రీతిలో సాగుతున్నాయి. మహిళలపై నేరాలు ఇంతగా పెచ్చుమీరడానికి ఉన్మాదులు యథేచ్ఛగా చెలరేగి పోవడానికి ప్రధాన కారణం నేరం చేయకూడదన్న భయం లేకపోవడమే. సత్వర దర్యాప్తు, నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడితేనే నేరాలు అదుపులోకి వస్తాయి. ఒక్కో ఘటన చూస్తుంటే మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా అన్న భయం కలుగుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా దారికి రావడంలేదు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షలు పడేలా చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరిస్తున్నారు. అలాగే డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కూడా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో ఇద్దరిపై గ్యాంగ్ రేప్, మరో ఇద్దరిపై ఘోర దాడులు కలచివేస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై ఆమె స్నేహితుడే పెట్రోలు పోసి తగలబెట్టగా, 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడవడం అత్యంత బాధాకరం, తెనాలిలో నర్సు దాడికి గురై బ్రెయిన్ డెడ్ స్టేజిలో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవలే నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి, హత్యకు గురైంది. జూన్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వారానికే బాపట్ల జిల్లా చీరాల వద్ద పంట పొలాల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించగా ఆమె సామూహిక అత్యాచారం, హత్యకు గురైందని గుర్తించారు. ఇవి తెలిసొచ్చిన అఘాయిత్యాల్లో కొన్ని మాత్రమే, బయటికి రానివి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు. జూన్లో బాపట్ల జిల్లాలో మహిళ హత్యాచారానికి గురైతే ఇప్పటికీ కేసు అతీగతీ లేదు. అలాంటిదే ఇంకో ఘటన జరిగాక తీరిగ్గా ఇప్పుడు ప్రత్యేక కోర్టులని, హైకోర్టుకు లేఖ రాస్తామంటున్నారు ముఖ్యమంత్రి, హోం మంత్రి. ఆడపిల్లపై చేయి వేసిన వాడికి అదే చివరి రోజవతుందని సి.ఎం, హోం మంత్రి నాలుగు మాసాల్లో ఎన్నో సార్లు హూంకరించినా ఘోరాలు ఆగింది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై, చిన్న పిల్లలపై నేరాలు 74 జరిగాయన్నది ఒక లెక్క ఆరుగురు హత్యకు గురికాగా, మరో ఐదుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అలాగని ఈ ప్రభుత్వం వచ్చాకనే మృగాళ్లు పుట్టుకొచ్చారని కాదు. గత ప్రభుత్వంలోనూ మహిళలపై కిరాతకాలు జరిగాయి. దిశ పోలీస్ స్టేషన్లు, యాప్ అన్నా ఘోరాలు నిరాటంకంగా జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం వల్లిస్తున్న ఫాస్ట్ ట్రాక్, స్పెషల్ కోర్టులు, నేరస్తులపై ఉక్కుపాదం వంటివి కూడా ఆ కోవలోనివే. అప్పుడూ ఇప్పుడూ మహిళలే సమిధలవుతున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు, పిల్లలు అదృశ్యమయ్యారని జనసేనాని ప్రకటించినా, తాను పాలనలోకొచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయారని అనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్త్రీలపై జరుగుతున్న దుర్మార్గాలపై మౌనం వహించడం. ఎవరికీ మంచిది కాదు. స్త్రీలను బతకనివ్వని చెరబట్టే విపత్కర రోజులు దాపురించాయి. మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రజలు కూడా చైతన్యం కావాలి. తమపక్కనేం జరుగుతుందో గమనించాలి. అత్యాచార ఘటనలు జరక్కుండా ఓ కన్నేయాలి. దుండగులను దునుమాడాలి. ప్రజలు మేల్కొంటే ఎంతటి రాక్షసులైనా తుదముట్టించవచ్చు.


Comments

-Advertisement-