-Advertisement-

మీకు తల నొస్తోందా..? జ్వరం వస్తోందా? కడుపు నొప్పి.. ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉన్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు. అనారోగ్య సమస్యలపై డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు..

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New
Peoples Motivation

మీకు తల నొస్తోందా..? జ్వరం వస్తోందా? కడుపు నొప్పి.. ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉన్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు. అనారోగ్య సమస్యలపై డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు..


• మెడికల్‌ షాపుల మాయాజాలం

• అనుభవం లేని వ్యక్తులు మందులు అమ్మకాలు

• అడ్డగోలుగా ఔషధ వ్యాపారం

• నామమాత్రంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు

• షాపుల్లో బినామీల దందా.. కానరాని ఫార్మసిస్టు

• రోగుల ప్రాణాలతో చెలగాటం

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New

యు కొత్తపల్లి (పీపుల్స్ మోటివేషన్):-

మీకు తల నొస్తోందా..? జ్వరం వస్తోందా? కడుపు నొప్పి.. ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉన్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు. అనారోగ్య సమస్యలపై డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు.

మెడికల్‌ షాపు చిన్నదైనా పెద్దదైనా అందులో ఫార్మాసిస్ట్‌ ఉండాలి. మందులు ఎలా వేసుకోవాలో రోగికి విడమర్చి చెప్పాలి. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే మందులు ఇవ్వాలి. రోగి శారీరక, మానసిక పరిస్థితిని బట్టే అవసరమైన మందులు ఇవ్వాలి. ఇలా మెడికల్‌ షాపుల నిర్వాహకులు నిబంధలను పాటించాలి. కానీ ఉమ్మడి జిల్లాలో మందుల దుకాణాల వ్యాపారం కిరాణ షాపుల్లా మారింది. డాక్టర్‌ రాసిచ్చే చిట్టీతో సంబంధం లేకుండా ఎవరడిగినా మందులు ఇచ్చేస్తున్నారు. డి-ఫార్మసీ/ఎం-ఫార్మసీ సర్టిఫికెట్‌ ఉంటే చాలు.. మెడికల్‌ షాపు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మీకు తల నొస్తోందా..? జ్వరం వస్తోందా? కడుపు నొప్పి.. ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉన్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు. అనారోగ్య సమస్యలపై డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు. తలెత్తిన అనారోగ్యం గురించి చెబితే చాలు.. మెడికల్‌ షాపుల్లో అన్ని రకాల మందులూ ఇస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా ఇస్తారు. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ అవసరమే లేదు. ఏ మందులు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్‌ షాపుల నిర్వాహకులే చెప్పేస్తారు. ఈ విధంగా మెడికల్‌ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం నిర్వహిస్తున్నారు. అల్లోపతి మెడిసిన్‌ విచ్చలవిడి అమ్మకాలపై ఔషధ నియంత్ర అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు తనిఖీలు చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే మెడికల్‌ షాపుల్లో మందులు ఇవ్వాలి. ఈ నిబంధనలను చాలా మంది దుకాణదారులు పాటించడం లేదు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపునొప్పి గ్యాస్ర్టిక్‌ సమస్యలు, ఒంటినొప్పులు తదితర సమస్యలకు మెడికల్‌ షాపుల్లో అడగ్గానే మందలిస్తున్నారు. కార్డియాలజీ, సైక్రియాట్రిక్‌, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్‌ స్ర్టోక్‌, డయాబెటిక్‌, బీపీ, థైరాయిడ్‌, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ తదితర సమస్యలకు డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వకూడదు. ఈ వ్యాధుల ఔషధాల్లో హై డోస్‌.. లో డోస్‌ అనే రకాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత, రోగి వయసు, శరీర తత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్‌ను నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్‌ షాపునకు వెళ్లి అడిగితే ఏ రోగానికైనా, ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొందరు దగ్గుకు వాడే సిర్‌పలు తాగుతున్నారు. కోరెక్స్‌, పెన్సిడ్రిల్‌ వంటి ఔషధాలు కొంత మత్తును కలిగిస్తాయి. ఆల్కహాల్‌, ఇతర మత్తు పదార్థాలకు బానిసైనవారు అవి దొరకని సమయాల్లో మెడికల్‌ సిర్‌పలు వాడుతున్నారు. ఈ తరహా సిర్‌పలు డాక్టర్‌ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్‌ షాపుల్లో ఎవరెన్ని, ఏమి అడిగినా ఇచ్చేస్తున్నారు.


లైసెన్స్‌ ఒకరిది.. నిర్వహణ మరొకరిది

ఉమ్మడి జిల్లాల్లో మందుల షాపులు బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్‌ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితో మాత్రమే దుకాణాలను నిర్వహించాలి. చాలా మంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్‌పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు, ఏడీలు మెడికల్‌ షాపుల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకొని నిబంధనలకు పాతరేస్తున్నారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లతో ఒప్పందాలు చేసుకొని మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు.


మామూళ్ల మత్తులో...

డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌ ప్రకారం ప్రతీ మెడికల్‌ షాపులో రిజిష్టర్డ్‌ ఫార్మసిస్టు ఉండాలి. బి-ఫార్మసీ, ఎం-ఫార్మసీ ఇలా ఏదో ఒక ఫార్మసీ కోర్సు చేసిన వారు మాత్రమే మెడికల్‌ షాపు నిర్వహించాలి. మెడికల్‌ షాపులకు అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మాసిస్టు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలి. ఏరియా ఇన్‌స్పెక్టర్లు ఈ బాధ్యత నిర్వర్తించాలి. కానీ కొందరు ఏరియా ఇన్‌స్పెక్టర్లు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.


పర్సంటేజీలు మాట్లాడుకొని...

జనరిక్‌, నాన్‌ జనరిక్‌ అనే తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని మెడికల్‌ షాపులు, కెమిస్ట్‌ డ్రగిస్ట్‌ ఏజెన్సీలపై దృష్టిసారించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Comments

-Advertisement-