ఇసుకను అలా చేస్తే పోలీసు, రెవిన్యూ సిబ్బందికి తెలియజేయండి
ఇసుకను అలా చేస్తే పోలీసు, రెవిన్యూ సిబ్బందికి తెలియజేయండి
• కేవలం తవ్వుకోవడం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే..
• ఇసుక పేరు చెప్పి ఎవరైనా అధిక రుసుము వసూలు చేస్తే వెంటనే పోలీసు, రెవిన్యూ సిబ్బందికి తెలియజేయండి..
సామాన్య ప్రజల ఇళ్ల నిర్మాణం, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరకు ఉచిత ప్రభుత్వం ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. సామాన్య ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించడం అందరికీ తెలిసిన విషయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.. అయితే కొంతమంది అత్యాశపరులు ఇసుకను ఉచితంగా కాకుండా లాబాపేక్షతో ఎక్కువ ధరకు విక్రయించడం జరుగుతున్నట్లు తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఇసుకకు నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అమ్మటానికి వీల్లేదని స్పష్టంగా చెప్పామన్నారు. ఎవరైనా దానిని అతిక్రమించి ఎక్కువ ధరకు అమ్మడం, వేరే వేరే వాళ్ళ పేర్లు చెప్పినటువంటి మాటలు నమ్మవద్దని మంత్రి సూచించారు..
ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ఇసుకకు ఎటువంటి ధర నిర్ణయించలేదని గమనించాలని మంత్రి కోరారు .. కేవలం తవ్వుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ కు మాత్రమే చార్జీలు ఉన్నాయని, ఇసుక కొనుక్కునేందుకు ఎటువంటి ధరను ప్రభుత్వం నిర్ణయించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఇసుక పేరు చెప్పి ఎవరైనా అధిక రుసుము వసూలు చేస్తే వెంటనే పోలీసు, రెవిన్యూ సిబ్బందికి తెలియజేయాలని, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వివరించారు.. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక కార్యక్రమం అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నదే తమ ధ్యేయం అన్నారు.. మనందరం కలిసి బాధ్యతతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, తద్వారా సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు..