-Advertisement-

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి..

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New
Peoples Motivation

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.. 

• ట్రాఫిక్ అవేర్ నెస్, కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించిన ... జిల్లా ఎస్పీ.

• మైనర డ్రైవింగ్ చేసిన వారికి కౌన్సిలింగ్... లఘు చిత్రాల ద్వారా అవగాహన.

-కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపియస్

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New

ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా మార్గదర్శకాలు, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ అన్నారు. 

ఈ సందర్బంగా శనివారం కర్నూలు కొత్త దగ్గరపేటలో ఉన్న ఆధునీకరించిన ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో ట్రాఫిక్ అవగాహన మరియు కౌన్సిలింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ గుర్తించారు. 

ఈ సందర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ... 

కర్నూలు లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు, ట్రాఫిక్‌ అంతరాయం సజావుగా సాగేందుకు ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటో డ్రైవర్లు తమ భద్రతకు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  డ్రైవర్లందరూ తప్పనిసరిగా ఆటోల స్వీకరణ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు.  డ్రైవర్లు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్‌లోడింగ్ చేయడం వంటివి చేయకూడదు.  ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆటోలను నిర్ణీత ప్రాంతాలలో మాత్రమే పార్కింగ్ చేయాలి. మైనర్లు వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరైతే లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గారి చేత ట్రాఫిక్ రూల్స్ గురించి లఘు చిత్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

కర్నూలు లో వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఆటో ఎక్కడానికి చేయి చాపడంతో ఆటో వాళ్ళు వెంటనే ముందు ఆలోచించకుండా ఆటోని అక్కడనే ఆపుతున్నారు. ట్రాఫిక్ అంతరాయాన్ని కలుగజేస్తూ, వెనుకవచ్చే వారికి ప్రమాదాలకు గురిచేయకూడదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగనీయకుండా ఆటోలు నడపాలన్నారు. ప్రతి ఆటోకు పోలీసు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉండాలి. రోడ్డు ప్రమాదాలు, నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్య కలాపాలు జరిగినా డయల్ 112 కు గాని, డయల్ 100 కు గాని పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్, ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ , కర్నూలు పట్టణ సిఐలు రామయ్యనాయుడు, నాగరాజా రావు, మురళీధర్ రెడ్డి, మధుసూధన గౌడ్, పవన్ కుమార్ , ట్రాఫిక్ ఆర్ ఎస్సై హుస్సేన్ , ఆటో యూనియన్ సంఘాలు, ఆటో డ్రైవర్లు ఉన్నారు.

Comments

-Advertisement-