దేశవ్యాప్తంగా నేటి నుంచి కొన్ని కొత్త నిబంధనలు మారనున్నాయి.. అవి ఇలా!!
దేశవ్యాప్తంగా నేటి నుంచి కొన్ని కొత్త నిబంధనలు మారనున్నాయి.. అవి ఇలా!!
• నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు..
• నేటి నుంచి ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ రూల్ అమలు..
• ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఛార్జీలు 3.75 శాతానికి పెంపు..
• రైల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ను 60 రోజులకు తగ్గింపు..
• ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఫీజు.. రివార్డు పాయింట్స్ విధానంలో మార్పులు..
• ఈ విధానం నవంబర్ 15 నుంచి అమలు..
• ఇండియన్ బ్యాంక్ FD స్కీం గడువు నవంబర్ 30 వరకు పెంపు..
నేటి నుంచి అనగా (నవంబర్ 1, 2024), డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ (DMT), పలు రకాల క్రెడిట్ కార్డ్లలో మార్పులు, LPG, ATF, CNG-PNG సిలిండర్ ధరలలో మార్పులు, ఆర్బీఐ దేశీయ నగదు బదిలీ లో కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానుంది. నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇలా పలు నిబంధనలో మార్పుల గురించి తెలుసుకుందాం..
దేశీయ నగదు బదిలీ (DMT) నియమం:
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి కొత్త దేశీయ నగదు బదిలీ (DMT) ఫ్రేమ వరన్ను ప్రకటించింది. ఇది నవంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఆర్బీఐ జూలై 2024 సర్క్యులర్లో..' బ్యాంకింగ్ అవుట్లెట్ లభ్యత, ఫండ్ బదిలీల కోసం చెల్లింపు వ్యవస్థలలో పురోగతి.. KYC అవసరాలను తీర్చడం మొదలైన వాటిలో గణనీయమైన పెరుగుదల ఉంది'. అని పేర్కొంది.
SBI క్రెడిట్ కార్డ్లో కొత్త మార్పులు:
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 1 నుండి దేశంలో అమల్లోకి రానున్న మార్పు గురించి మాట్లాడుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంస్థ SBI కార్డ్ తన క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించిన పెద్ద మార్పులను నవంబర్ 1 నుండి అమలు చేయబోతోంది. నవంబర్ 1 నుండి అసురక్షిత SBI క్రెడిట్ కార్డపై ప్రతి నెలా రూ. 3.75 ఫైనాన్స్ ఛార్జీలు చెల్లించాలి. ఇది కాకుండా.. విద్యుత్, నీరు, ఎల్పిజి గ్యాస్, ఇతర యుటిలిటీ సేవలకు రూ.50,000 కంటే ఎక్కువ చెల్లింపుపై 1 శాతం అదనపు ఛార్జీ విధించబడుతుంది. ఇది 2024 డిసెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది.
ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్లలో కొత్త మార్పులు:
ICICI బ్యాంక్ దాని ఫీజు నిర్మాణం, క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్లలో మార్పులు చేసింది. అందులో బీమా, కిరాణా షాపింగ్, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధన సర్చార్జ్ మినహాయింపులు, ఆలస్యమైన చెల్లింపు రుసుములను ప్రభావితం చేస్తుంది. అయితే ఇది 2024 నవంబర్ 15 నుండి అమలులోకి వస్తుంది.
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FD గడువు:
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్సెడ్ డిపాజిట్ (FD)లో పెట్టుబడిని 2024 నవంబర్ 30 వరకు మాత్రమే.. ఇదే చివరి తేదీ. ఇండ్ సూపర్ 300 రోజుల వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు 7.05%, సీనియర్ సిటిజన్లకు 7.55%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80%. ప్రత్యేకంగా 400 రోజుల పాటు, బ్యాంక్ సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.00% వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది.
IRCTC రైలు టిక్కెట్ బుకింగ్:
ఇండియన్ రైల్వే అడ్వాన్స్ రైలు టిక్కెట్ బుకింగ్ కోసం ప్రస్తుత కాల పరిమితిని తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. దీంతో ప్రయాణీకులు ఇప్పుడు 60 రోజుల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. ఈ ముందస్తు రిజర్వేషన్ వ్యవధి బయలుదేరే రోజు మినహాయించబడుతుంది. ఇది 2024 నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది,. అయితే ఇది ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులపై ప్రభావం చూపదు.
TRAI కొత్త నియమం:
స్పామ్, మోసాలను నిరోధించడానికి.. టెలికాం కంపెనీలు కొత్త నిబంధనల ప్రకారం మెసేజ్ ట్రేసబిలిటీని ప్రారంభిస్తాయి. దీనితో పాటు లావాదేవీలు, ప్రచార సందేశాలు పర్యవేక్షించబడతాయి.
ATF, CNG-PNG :
చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా 1వ తేదీన సవరిస్తాయన్న విషయం, తెలిసిందే. దీనితో పాటు CNG-PNG, ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు కూడా మారుతాయి. గత కొన్ని నెలలుగా వాయు ఇంధనం ధరలో తగ్గుదల ఉంది. ఈసారి కూడా ధరలను తగ్గించి పండుగ కానుకగా భావిస్తున్నారు. ఇది కాకుండా, CNG - PNG ధరలలో కూడా పెద్ద మార్పును చూడవచ్చని అంచనా వేస్తున్నారు.
LPG సిలిండర్ ధరలు:
ప్రతి నెల మొదటి తేదీన, పెట్రోలియం కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను మారుస్తాయి. ఇందులో భాగంగా కొత్త రేట్లను విడుదల చేస్తాయి. ఈసారి కూడా దీని ధరలు నవంబర్ 1వ తేదీన మారుతాయి. చాలా కాలంగా నిలకడగా ఉన్న 14 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలు ఈసారి మరింత తగ్గుముఖం పడతాయని ప్రజలు భావిస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర గురించి చూస్తే.. జూలై నెలలో 19 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర తగ్గింది. అయితే, ఆ తర్వాత వరుసగా మూడు నెలలు పెరుగుతూ వచ్చింది.
బ్యాంకు సెలవులు:
పండుగలు, ప్రభుత్వ సెలవులు అలాగే అసెంబ్లీ ఎన్నికల కారణంగా వివిధ రాష్ట్రాలలో వివిధ రోజులను చూస్తే.. మొత్తంగా 13 రోజుల పాటు బ్యాంకుల్లో పని ఉండదు. నవంబర్లో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ బ్యాంక్ సెలవుల సమయంలో, మీరు బ్యాంకుల ఆన్లైన్ సేవలను ఉపయోగించి మీ బ్యాంకింగ్ సంబంధిత పని, లావాదేవీలను పూర్తి చేయవచ్చు.