-Advertisement-

AP Liquor Policy: తాజాగా 340 మద్యం షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New
Peoples Motivation

AP Liquor Policy: తాజాగా 340 మద్యం షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New

ఏపీలో తాజాగా కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం 3396 మద్యం షాపుల ను లాటరీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించింది. ఇందులోనూ సిండికేట్ల విమర్శలు వచ్చినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వస్తుండటంతో వాటి నియంత్రణకు ఇప్పుడు ప్లాన్ సిద్దం చేసింది. ఇందులో భాగంగా టెండర్ కమిటీని ఏర్పాటు చేయబోతోంది. అయితే టెండర్ కమిటీ ఏర్పాటు చేసినా దాంతో మద్యం ధరలు దిగొస్తాయా అంటే గ్యారంటీ లేదని నిపుణులు చెప్తున్నారు. అధికంగా ఉన్న కొన్ని బ్రాండ్ల ధరలను మాత్రంం సవరిస్తారని తెలుస్తోంది. మిగతా ధరలు, డిమాండ్ ఎక్కువగా ఉన్న బ్రాండ్లపై ధరలు తగ్గే అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పటికే మద్యం ధరల విషయంలో పలు జాగ్ర్తతలు తీసుకోవడంతో పాటు క్వాలిటీ మద్యాన్ని సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా ధరలు తగ్గిస్తామని మాత్రం బహిరంగంగా చెప్పడం లేదు. దీంతో ధరల తగ్గింపు గ్యారంటీ లేదనే చర్చ సాగుతోంది.

మరోవైపు రెగ్యులర్ మద్యం షాపులతో పాటు కల్లు గీత కార్మికుల కోసం మరో 340 మద్యం షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు చోట్ల కల్తీ మద్యం, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారన్న వైసీపీ విమర్శల నేపథ్యంలో కల్లు గీత దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. వారంలోనే ఈ షాపులు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో మద్యం విధానం పారదర్శకంగా ఉండేలా చూస్తామని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

Comments

-Advertisement-