-Advertisement-

Agniveer Recruitment Rally: అభ్యర్థులకు అలెర్ట్.. డిసెంబర్‌ 8 నుంచి అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Agniveer Recruitment 2024 official website Agniveer scheme Agniveer Apply Agniveer Navy Join Indian Navy join indian army.com online Join Indian Army
Peoples Motivation

Agniveer Recruitment Rally: అభ్యర్థులకు అలెర్ట్.. డిసెంబర్‌ 8 నుంచి అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Agniveer Recruitment Rally: హైదరాబాద్‌లో అగ్నివీరుల రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్‌ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ నియామక ర్యాలీలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో ఈ ర్యాలీలు జరగనున్నాయి. 

Agniveer Recruitment 2024 official website Agniveer scheme Agniveer Apply Agniveer Navy Join Indian Navy join indian army.com online Join Indian Army

Agniveer Recruitment Rally:
హైదరాబాద్‌లో అగ్నివీరుల రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్‌ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ నియామక ర్యాలీలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో ఈ ర్యాలీలు జరగనున్నాయి. 

ఈ అగ్నివీర్ నియామకాల్లో భాగంగా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌,అ గ్నివీర్‌ క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ కేటగిరీల్లో భర్తీలు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి( కరైకల్‌-యానాం ) మహిళా మిలటరీ పోలీస్‌ (WMP) అభ్యర్థులు.. 2024 ఫిబ్రవరి 12వ తేదీ నాటి ర్యాలీ నోటిఫికేషన్‌ ప్రకారం అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.

ఈ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగుతుందని అధికారులు తెలిపారు. నియామక ర్యాలీలో ఉత్తీర్ణత సాధించడానికి సాయం చేస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని సూచించారు. మోసపూరిత ట్వీట్లు, మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే.. రిక్రూట్‌మెంట్‌ కార్యాలయానికి చెందిన ఫోన్‌ నంబర్లు 040-27740059, 27740205 సంప్రదించాలని సూచించారు.

Comments

-Advertisement-