త్వరలో దేవాదాయ శాఖలో 500 పోస్టుల భర్తీ
త్వరలో దేవాదాయ శాఖలో 500 పోస్టుల భర్తీ
దేశీయ రకం గోవులను పెంచేవారికి దేవాదాయ శాఖ తరపున 5 శాతం సబ్సిడీ
త్వరలో దేవాలయ ట్రస్టు బోర్డుల నియామకాలు
ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో నిరుద్యోగ సంభావన
ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీలో ఏ సామాగ్రే వాడాలి
దేవాలయాల్లో కావాల్సింది ఆధ్యాత్మిక చింతన.. వ్యాపార ధోరణి కాదు
ఆలయాల్లో ఓంకారాలు, దేవతా మూర్తుల వేద మంత్రోచ్ఛారణ నిరంతరం వినిపించాలి
ఎన్నికల హామీల అమలులో అగ్రభాగంలో దేవాదాయ శాఖ
-దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ క్యాడర్లలోని అధికారులు, అర్చకులకు సంబంధించి 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషనర్‌లో గురువారం రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాదాయ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాలనా సంబంధిత అధికారులను నియమించడానికి మంత్రి చర్యలు తీసుకున్నారు.
దేవాలయాలన్నీ శుభ్రత, ఆధ్యాత్మికతలో కళకళలాడే అధికారులందరూ పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉందని దానిని కాపాడే విషయంలో నిర్లిప్తత ఉండకూడదన్నారు. కార్తీక మాసంలో నిర్దేశించిన ప్రాంతాల్లో చతుర్వేద సభలు నిర్వహించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గడచిన నాలుగు నెలల కాలంలో దేవాదాయ శాఖలో అనేక మార్పులు తీసుకుని వచ్చామని, ఇంతవరకు దేవాదాయ శాఖ అంటే చాలా చిన్నదిగా భావించే అందరి భ్రమలను తొలగిస్తూ ఈ శాఖ ఎంతో గొప్పది అనే పేరు సాధించామని, ఈ పేరు చిరకాలం నిలిచిపోయే అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. 50 వేల పైబడిన ఆదాయం ఉన్న ఇద్దరి దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలు ఉండేలా నిర్ణయం తీసుకున్న దేవాలయాల గుర్తుకు తెస్తూ, ట్రస్టు బోర్డుల్లో అదనంగా సభ్యులను నియమించాలన్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డినెన్సు త్వరలో జారీ అవుతోంది. నిర్దేశిత కాలపరిమితితో, స్పష్టమైన మార్గదర్శకాలతో సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ను వెలువరిస్తామన్నారు.
దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన వేద సభలో వేదపారాయణం పండితులనే కాకుండా పామరులను కూడా ఉత్తేజపరచడం, దానిని నిర్వహించడం ఒక ప్రాంతానికే పరమితం చేయకుండా, వేద పఠనం విశిష్టత, వేద స్ఫూర్తి నలుదిశలా కొనసాగుతూ, దాని అర్థాన్ని తెలుసుకోవాలనే ఉత్సవాలను వేదాలలో అందరూ చూడాలన్న ఉమ్మడి జిల్లాల లక్ష్యం. వేదాధ్యయనం చేసి, ఉపాథి కోసం ఎదురు చూస్తున్న వేద పండితులకు , యువగళం స్ఫూర్తితో సంభావన పేరుతో నెలకు 3 వేలను విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేశామని, ఈ పథకం కింద గుర్తించిన సుమారు 600 మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ లబ్ధిని అందించామన్నారు.
దేవాలయాల్లో ప్రసాదం, అన్న ప్రసాదం తయారీలో వినియోగించే సామగ్రిని అంతటినీ, ఏ రకానివే వినియోగించేలా చూడాలని, కేంద్రీకృత వ్యవస్థను తీసుకురానున్నామని,ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించామన్నారు. కాకుండా, ఆయా దేవాలయాల్లో పారిశుద్ధ్య పనులు, భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా మానవ వనరుల వినియోగంలో కూడా కేంద్రీకృత విధానాలు తీసుకుని వస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రధానమైన దేవాలయాన్ని కూడా ప్రసాదం రుచి గతంలో కంటే మెరుగ్గా ఉందన్న ఫీడ్ బ్యాక్ వస్తుందన్నారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడవద్దన్నారు. అవసరాలకు అనుగుణంగా ఆవు నెయ్యిని అందించడానికి వీలుగా, దేశీయ గోవులను పెంచేందుకు ఆసక్తి చూపే వారికి దేవాదాయ శాఖ తరపున 5 శాతం సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన. కాకుండా ఆయా దేవాలయాలకు దాతలు వివిధ రూపాల్లో విరాళాలు ఇస్తుంటారని, వాటిపై దాతల పేర్లు తప్పకుండా ఉండేలా చూడడంతో పాటు, వారికి ఆలయాల్లో సముచిత గౌరవమిస్తే, మరింత మంది దాతలు ముందుకు వస్తారన్న ఆలయ ఎగ్జుక్యూటవ్ అధికారులందరూ గుర్తించాలన్నారు. అలాగే దాతలిచ్చిన విరాళాల వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో తప్పని సరిగా రికార్డు చేయాలన్నారు.
ఆలయాల ఆస్తులు పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని, ఇప్పటికే వివిధ రకాలుగా కబ్జా అయిన వాటిపై సమగ్రంగా నివేదిక రూపొందించాలన్నారు. అలాగే కొంత మంది అధికారులు ప్రైవేటు వ్యక్తుల భూములను 22(ఎ) కింద గుర్తించినందువల్ల, వ్యక్తులు ఆయా నష్టపోతున్నారని, దేవాదాయ శాఖ అధికారులు దీనిని అధికారులతో సంప్రదించి, జిల్లా కలెక్టర్ ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆలయంలోనూ ఆయా దేవతా మూర్తుల, నామ స్మరణ క్రమం తప్పకుండా జరిగేలా ఆలయం విశిష్టతను కాపాడాలని మంత్రి వివరించారు.
పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరలోనే టెంపుల్ టూరిజం ను అభివృద్ధి చేయడం, కేటాయించిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కూడా త్వరలోనే నిర్వహించనున్నాం. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, అదనపు కమిషనర్లు చంద్రకుమార్, రామమోహన్ లతో పాటు ఈ సమీక్షలో ఉన్నారు.