ఓర్వకల్ లో డ్రోన్ హబ్‌కు 300 ఎకరాలు
ఓర్వకల్ లో డ్రోన్ హబ్‌కు 300 ఎకరాలు
స్థలాలను పరిశీలించి డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ కె. దినేష్ కుమార్
స్థల సేకరణ త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
జిల్లా ఆర్టీజీఎస్ , పైబర్ నెట్ జిల్లా కేంద్రాలూ పరిశీల
అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల స్థంలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఓర్వకల్లు ప్రాంతాన్ని డ్రోన్ హబ్ గా అభివృద్ధి చేస్తామని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ఈ హబ్ ఏర్పాటుకు సంబంధించిన స్థలాలను దినేష్ కుమార్ శనివారం పరిశీలించారు. ఓర్వకల్లు, పాలకొలను, కోమరోలు, చింతపల్లె, సోమయాజులపల్లో డ్రోన్ హబ్ ఏర్పాటుకు అనువైన భూములను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన డ్రోన్ హబ్ స్థలాల సేకరణ గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చింతలపల్లె గ్రామం వద్ద పాలకొలను, మరియు కొమరోలు వద్ద కొన్ని భూములు డ్రోన్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థలాలున్నాయని వివరించారు. ఆ స్థలాలను కూడా డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఓర్వకల్లును డ్రోన్ హబ్గా ఏర్పాటు చేయాలని సీఎం ఎంతో దృఢ నిశ్చయ్యంతో ఉన్నారని, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోందని చెప్పారు. ఈ డ్రోన్ హబ్ ఏర్పాటు వల్ల ఇక్కడ ఎంతో మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ హబ్ ఏర్పాటుకు కావాల్సిన భూముల సేకరణకు అత్యంత ప్రాధాన్యతివ్వాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా భూముల గురించి ఈ స్థలా సేకరణ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు. స్థల సేకరణ, అనువైన స్థలాల గుర్తింపులో భాగంగా, ఏపీఐఐసీ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భూములు గుర్తింపు ఒక్కసారి పూర్తి చేస్తే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామ’ని, సీఎం సూచనలతో ఈ ప్రాజెక్టు ఈ భూముల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపైన ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. స్థల సేకరణ పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుబడా అధికారులు పని చేయాలని సూచించారు. కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేర్, మండల తహసీల్దార్ విద్యాసాగర్‌లు ఆ ప్రాంతంలో భూముల లభ్యత గురించి డ్రోన్ కార్పొరేషన్ సీఎండీకి వివరించారు.
జిల్లా ఆర్టీజీఎస్ కేంద్రం పరిశీలన
కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రిలయ్ టైం గవర్నెన్స్ సొసైటీ జిల్లా సెంటర్ నిర్మాణ పనులను ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ పరిశీలించారు. కర్నాలు పర్యా టనలో భాగంగా ఆయన జిల్లా కలెక్టరేట్‌లో చేపడుతున్న ఆర్టీజీఎస్ నిర్మాణ పనులు ఎంతగా జరుగతున్నాయనేదాని గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆర్టీజీఎస్ కేంద్రాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయ న ప్రాజెక్ట్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్‌కు అనుసంధానంగా ఒక ప్రత్యేక ఆర్టీజీఎస్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్ర నిర్మాణం అత్యంత ప్రాధాన్యతిచ్చి నిర్ణీత గడువులోపు వీటి నిర్మానలను పూర్తి చేయనున్నారు.
పైబర్‌నెట్ కేంద్రం పరిశీలన
కర్నూలు ఏర్పాటు పైబర్ నెట్ కేంద్రాన్ని ఏపీ పైబర్ నెట్ సీఎండీ హోదాలో దినేష్ కుయమార్ పరిశీలించారు. కర్నూలు జిల్లాలో పైబర్ నెట్ విస్తరణ పనులను అక్కడి అధికారులతో ఆయన సమీక్షించారు.