2025 Holidays List: 2025 సెలవులు లిస్ట్- తేదీలు ఇలా.. ఏ నెలలో ఎక్కువ సెలవులు?
2025 Holidays List: 2025 సెలవులు లిస్ట్- తేదీలు ఇలా.. ఏ నెలలో ఎక్కువ సెలవులు?
• 2025 సంవత్సరంలో సెలవులు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
• జీవో విడుదల చేసిన రాష్ట్ర సర్కార్..
• 2025లో మొత్తంగా 27 సాధారణ సెలవులు..
• 2025లో మొత్తంగా 23 ఐచ్ఛిక సెలవులు..
2025 Holidays List: 2025 సంవత్సరానికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2025లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1న సాధారణ సెలవు ప్రకటించినందున, ఫిబ్రవరిలో రెండో శనివారం పనిరోజుగా ఉంటుందని జీవోలో సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. మొత్తం 23 ఐచ్ఛిక సెలవుల్లో ఉద్యోగులు గరిష్ఠంగా ఐదు తీసుకోవచ్చునని చెప్పారు.
క్యాలెండర్ లో సెలవుల జాబితా ఇలా:
జనవరి 1, భోగీ, సంక్రాంతి, గణతంత్ర దినం, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్, బాబూ జగజ్జీవన్ రాం, శ్రీరామనవమి, అంబేడ్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బక్రీద్, మొహరం, బోనాలు, స్వాతంత్య్ర దినం, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ, బతుకమ్మ, గాంధీ జయంతి, దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి, క్రిస్మస్ ను సాధారణ సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న సాధారణ సెలవు ప్రకటించినందున, ఫిబ్రవరిలో రెండో శనివారం పనిరోజుగా ఉంటుందని జీవోలో సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. మొత్తం 23 ఐచ్ఛిక సెలవుల్లో ఉద్యోగులు గరిష్ఠంగా ఐదు తీసుకోవచ్చునని చెప్పారు. రంజాన్, మొహరం, మిలాద్ ఉన్ నబీ పండుగలకు నెలవంక కనిపించిన రోజు ప్రకారం సెలవు రోజు మారితే మీడియా ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పరిశ్రమలు, విద్యా సంస్థల్లోని ఉద్యోగులకు సెలవులు ఆయా శాఖలు ప్రత్యేకంగా వెల్లడిస్తాయని జీవోలో తెలిపారు.