YIL JOBS: పరీక్ష లేకుండానే జాబ్.. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారీ నోటిఫికేషన్
YIL JOBS: పరీక్ష లేకుండానే జాబ్.. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారీ నోటిఫికేషన్
యంత్ర ఇండియా లిమిటెడ్ భారీ నోటిఫికేషన్..
3883 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
చివరి తేదీ 2024 నవంబర్ 21
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 'యంత్ర ఇండియా లిమిటెడ్' 3883 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
ఐటీఐ - 2498 పోస్టులు
నాన్-ఐటీఐ - 1385 పోస్టులు
మొత్తం పోస్టులు - 3883
విద్యార్హతలు(Educational Qualification)
నాన్-ఐటీఐ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ముఖ్యంగా గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.ఐటీఐ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే, NCVT లేదా SCVT గుర్తింపు కలిగిన సంస్థ నిర్వహించిన ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి (Age limit)
ఐటీఐ, నాన్-ఐటీఐ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే, అభ్యర్థుల వయస్సు 14- 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము (Application Fee)
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200+ జీఎస్టీ చెల్లించాలి.మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.100 + జీఎస్టీ చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
ఐటీఐ, నాన్-ఐటీఐ పోస్టులకు వేర్వేరుగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు.నాన్-ఐటీఐ ఉద్యోగాలకు అయితే పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఐటీఐ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం (Application Process)
అభ్యర్థులు ముుందుగా యంత్ర ఇండియా లిమిటెడ్ వైబ్‌సైట్ ఓపెన్ చేయాలి.తరువాత ట్రేడ్ అప్రెంటీస్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు దరఖాస్తు ఫారమ్‌లో నింపాలి.మీ ఫొటో, సిగ్నేచర్, ఐడీ ప్రూఫ్ సహా, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 అక్టోబర్ 22
దరఖాస్తుకు చివరి తేదీ : 2024 నవంబర్ 21