-Advertisement-

UBI JOBS: బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ గా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వివరాలు

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS
Peoples Motivation

UBI JOBS: బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ గా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వివరాలు 

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) (జేఎంజీఎస్‌-I స్కేల్): 1,500 పోస్టులు కేటగిరీల వారిగా...

ఎస్సీ- 224; ఎస్టీ- 109; ఓబీసీ- 404; ఈడబ్ల్యూఎస్‌- 150; యూఆర్‌- 613)


రాష్ట్రాల వారీగా ఖాళీలు (State Wise Vacancies):

ఆంధ్రప్రదేశ్- 200, అస్సాం- 50, గుజరాత్- 200, కర్ణాటక- 300, కేరళ- 100, మహారాష్ట్ర- 50, ఒడిశా- 100, తమిళనాడు- 200, తెలంగాణ- 200, పశ్చిమ్‌ బెంగాల్- 100.

అర్హతలు (Eligibilitys)

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి (Age limit)

01.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం (Basic Pay Scale)

 నెలకు రూ.48,480-రూ.85,920.


ఎంపిక ప్రక్రియ (Selection Process)

ఆన్‌లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ అప్లికేషన్స్ స్క్రీనింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


దరఖాస్తు రుసుము (Application Fee)

జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.


 ఆన్‌లైన్ పరీక్ష/ సబ్జెక్టులు

రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ (35 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్- లెటర్ రైటింగ్ & ఎస్సే (2 ప్రశ్నలు- 25 మార్కులు).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.


ముఖ్యమైన తేదీలు (Important Dates)

 ఆన్‌లైన్ దరఖాస్తులు/ ఫీజు చెల్లింపు ప్రారంభం: 24.10.2024.

 ఆన్‌లైన్ దరఖాస్తులు/ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 13.11.2024.

Official website: www.unionbankofindia.co.in


Comments

-Advertisement-