-Advertisement-

TTD: 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరణ

TTD Calendar 2025 Telugu TTD Calendar 2025 PDF TTD calendar 2025 price TTD Diary 2025 online Booking TTD Calendar 2025 TTD tickets online booking
Peoples Motivation

TTD: 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరణ

TTD Calendar 2025 Telugu TTD Calendar 2025 PDF TTD calendar 2025 price TTD Diary 2025 online Booking TTD Calendar 2025 TTD tickets online booking

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్ర‌బాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.

12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు- శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 3 లక్షలు, 6 షిట్ క్యాలెండ‌ర్లు 50 వేలు, టీటీడీ స్థానిక ఆల‌యాలు 10 వేలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.

 రాష్ట్ర దేవదాయ శాఖ అమాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో జయ శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు.

కాగా 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అక్టోబరు 5వ తేదీ నుండి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

Comments

-Advertisement-