Traffic Rules: ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే, కఠిన చర్యలు తీసుకుంటాం
Traffic Rules: ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే, కఠిన చర్యలు తీసుకుంటాం
పోలీస్ ఫాల్కన్ వాహనం ద్వారా ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా, పరోక్షంగా కూడా సమర్థవంతంగా పని చేస్తామని ఎస్పీ తెలియజేశారు.
ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలపై కేవలం నేరుగా మాత్రమే కాకుండా, జిల్లాలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా కూడా నిఘా ఉంచి, జరిమానాలు విధించబడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేదా సరైన పత్రాలు లేని వాహనాలు, వేగవంతమైన లేదా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు.
ఫాల్కన్ వాహనంలో ఉన్న కెమెరాలు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న ప్రజలపై జరిమానాలను విధించడానికి ఉపయోగిస్తాము. "నియమాలను పాటించడం ప్రతి మనిషి బాధ్యత" అని ఎస్పీ అన్నారు. ఈ విధానం ద్వారా, చిత్తూరు పట్టణములో ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేయడం కంటే ప్రజల భద్రతను పెంచడంలో ఇది ఒక కీలక సాధనంగా నిలుస్తుందని, అలాగే, ఈ వాహనాన్ని ఉపయోగించడం ద్వారా "సరైన దిశలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, సమర్ధవంతంగా చర్యలు తీసుకుంటామని" అన్నారు. ఫాల్కన్ వాహనంతో, ప్రజల రక్షణను కాపాడుతూ, సమాజంలో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా పనిచేస్తాము.
"ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత," అని "ఎవరైతే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తారో, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. సిసి కెమెరాల ద్వారా కూడా ప్రతి వ్యక్తి చర్యలను పర్యవేక్షిస్తున్నాం," అని తెలిపారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు మైనర్ వయస్సులో వాహనాలు నడపడం పూర్తిగా నిషేధించబడిందని, ఎవరైతే మైనర్ లకు వాహనాలు ఇస్తారో వారే శిక్షించబడతారని, "ట్రిపుల్ రైడింగ్, మొబైల్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలు మీ జీవితాలకు ముప్పు కలిగిస్తాయి" అని హెచ్చరించారు. కావున ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించి, చిత్తూరు జిల్లాలో రోడ్డు భద్రతకు సహకరించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు సూచించారు.
ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని మరియు ట్రాఫిక్ నియమాలు ఉల్లంగిస్తూ ఎవరైనా కనిపిస్తే వారు నడుపుతున్న వాహన నెంబర్ ప్లేట్ కనిపించే విధంగా ఫోటో లేదా వీడియో ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నెంబర్ 9491074515 కు పంపాలని, పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.