Tenth Exams: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు నోటిఫికేషన్ విడుదల
Tenth Exams: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు నోటిఫికేషన్ విడుదల
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు నోటిఫికేషన్..
ఫీజు చెల్లించేందుకు ఈనెల 28 నుంచి నవంబరు 11లోపు గడువు..
ఆలస్య రుసుముతో 30వ తేదీ వరకూ అవకాశం..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక పరీక్షల ప్రక్రియ మొదలైనట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 28 నుంచి నవంబరు 11లోపు ఫీజు చెల్లించాలని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఆలోపు కట్టలేని వారు ఆలస్య రుసుముతో చెల్లించేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు.ఇక పరీక్షల ఫీజు కట్టే తేదీలు వచ్చాయి కాబట్టి విద్యార్థులు చదువుపై ఫోకస్ పెట్టాలని ప్రణాళిక ప్రకారం చదివితే మంచి మార్కులు సాధించవచ్చని అన్నారు.
12వ తేదీ నుంచి నవంబరు 18 వరకు చెల్లిస్తే రూ.50/-, 19 నుంచి 25 వరకు రూ.200/-, 26 నుంచి నవంబరు 30 వరకు రూ.500/- ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని, పాఠశాల లాగిన్ ద్వారా హెడ్మాష్టార్లూ చెల్లించవచ్చని సూచించారు. రెగ్యులర్ విద్యార్థులు 125 రూపాయలు, సప్లిమెంటరీ రాసే విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు 110 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉంటే 125 రూపాయలు, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా 60 రూపాయలు చెల్లించాలని తెలిపారు. వయసు తక్కువగా ఉండి పరీక్షలకు హాజరయ్యే వారు 300 రూపాయలు, మైగ్రేషన్ సర్టిఫికెట్ కావలసిన వారు 80 రూపాయలు చెల్లించాలని సూచించారు.