Sweet Corn: పోషకాల గని మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!!
Sweet Corn: పోషకాల గని మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!!
మొక్కజొన్న చౌకగా లభించే పోషకాహారం. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. మొక్కపొత్తులను బొగ్గులమీద కాల్చినా, నీళ్లలో ఉడికించినా అవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!
• సీజనల్‌గా లభించే మొక్కజొన్న గింజలు తినడం వలన శరీరానికి లినోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్‌తోపాటు ఎ, ఇ, బీ 1, బీ 6, రైబోఫ్లవిన్, థయమిన్ అనే విటమిన్లు అందుతాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత తగ్గి ఎర్ర రక్తకణాలు వృద్ది చెందుతాయి. కంటి చూపు మెరుగవుతుంది.
• మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద ముడతలు రాకుండా చేస్తాయి. ఈ గింజల నుంచి తీసిన నూనె చర్మవ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది.
• మొక్కజొన్న గింజల నుంచి తయారుచేసే పాప్‌కార్న్, కార్న్‌ఫ్లేక్స్ అనేవి పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన చిరుతిండి. వీటి ద్వారా లభించే పీచుపదార్థం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం, మొలలు, పేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.
• ఉడికించిన మొక్కజొన్న గింజలు తినడం వలన రక్తంలో కొవ్వు స్థాయి తగ్గుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తపోటు, పక్షవాతం, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
• చలికాలంలో ఎదురయ్యే జుట్టు సమస్యలను అధిగమించేందుకు మొక్కజొన్న గింజలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. వీటి నుంచి లభించే సి విటమిన్, ఖనిజాలు చర్మానికి, జుట్టుకు పోషణను, శక్తిని అందిస్తాయి.
• మొక్కజొన్నలో పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి. బరువు పెరగాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. శరీరంలోని కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది