Super Six: సూపర్ సిక్స్ హామీ అమలుకు శ్రీకారం… దీపావళి ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
Super Six: సూపర్ సిక్స్ హామీ అమలుకు శ్రీకారం… దీపావళి ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
దీపావళి నుంచి అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలెండర్లు
ఏడాదికి రూ.3000 కోట్ల ఖర్చు
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం
-రాష్ట్ర పౌరసారఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడి
ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం త్వరలోనే అమల్లోకి తీసుకు వస్తున్నామని, రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందని, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఆదివారం తెనాలి నియోజకవర్గం పరిధిలో కాజీపేట, కొలకలూరు, ఎరుకలపూడి, కటెవరం, అంగలకుదురుల్లో సుమారు రూ.కోటి 65 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వ హామీల్లో ముందడుగు వేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇచ్చిన హామీ లబ్ధిదారుల ఇళ్ళలో వెలుగును నింపుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్ సిక్స్ లో ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలెండర్లను అంధజేయడానికి శ్రీకారం చుడుతున్నాము. 23వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తాము.
సూపర్ సిక్స్ కార్యాచరణలో ప్రధాన్యతగా పౌరసరఫరాల శాఖ నుంచి పథకం ప్రారంభం అవుతోంది. అర్హత వున్న ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. దీపావళి నుంచి ప్రారంభం అయ్యే ఈ పధకం ప్రతి కుటుంబంలోనూ వెలుగు నింపుతుంది.
ప్రతి మహిళ గుర్తుపెట్టుకునే విధంగా అమలవుతుంది. ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి సుమారు రూ. 3000 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కూటమి ప్రభుత్వ పాలనదక్షతకు, చిత్తశుద్ధికి నిదర్శనం.
ప్రజలను గౌరవిస్తూ వారి నమ్మకాన్ని నిలబెడుతున్నాము దీని అమలుకు సంబంధించి పూర్తి వివరాలు ఒకటిరెండు రోజుల్లో వెల్లడిస్తాము. రాష్ట్రంలో సుమారు కోటి 45 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన దీపం పథకం కలుపుకుని ఈ పధకాన్ని అమలు చేస్తాము. అర్హత వున్న ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ పథకం అమలుచేయాలన్నది మా సంకల్పం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నాము. ఎంత ఖర్చయినా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ పక్తకంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్ పి, భారత్ గ్యాస్ కంపెనీలు భాగస్వామ్యం అయ్యాయి.
కూటమి ప్రభుత్వం ద్వారా మంచి చేస్తారనే ఉద్దేశంతో ఓట్లు వేశారు. వారి నమ్మకాన్ని నిలబెడుతున్నాం. ప్రజలను గౌరవిస్తున్నాం. వారి ఓటుకు విలువ ఇచ్చాము. గత వైసిపీ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా ధాన్యం కొని రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు.ఆ ప్రభుత్వం ఇవ్వకుండా ఆపేసిన రూ. 1674 కోట్లను కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించాము. ఆది రైతులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం” అని తెలిపారు.