-Advertisement-

SATHEE: జేఈఈ, నీట్‌ ఫ్రీ కోచింగ్ ? సాథీ లో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి?

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

SATHEE: జేఈఈ, నీట్‌ ఫ్రీ కోచింగ్ ? సాథీ లో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి?

SATHEE: జేఈఈ (JEE Main 2025), నీట్‌ (NEET) సహా పలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సువర్ణావకాశం. ఐఐటీ కాన్పూర్‌తో కలిసి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సాథీ (SATHEE - సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, టెస్ట్‌ అండ్‌ హెల్ప్‌ ఫర్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) అనే పోర్టల్‌ ద్వారా విశేష సేవలందిస్తోంది. దీని ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఐఐటీ ప్రొఫెసర్లు/ సబ్జెక్టుల్లో నిపుణులతో ఉచితంగానే నాణ్యమైన గైడెన్స్‌ ఇస్తోంది. జేఈఈ మెయిన్‌-2025కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల కోసం నవంబర్‌ 6 నుంచి 40 రోజుల క్రాష్‌ కోర్సును ప్రారంభించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

జేఈఈ మెయిన్‌(JEE Main)కు సంబంధించి రికార్డ్‌ చేసిన లెక్చర్స్‌ను వారం వారం ఈ పోర్టల్‌లో వీక్షించవచ్చు. క్విజ్‌లో పాల్గొని మీరు ఏ మేరకు నేర్చుకున్నారో పరీక్షించుకునే వీలుంటుంది. ఏఐ ఆధారిత అసెస్‌మెంట్‌లో భాగంగా 60వేలకు పైగా ప్రశ్నలను దీని ద్వారా యాక్సిస్‌ చేసుకోవచ్చు. 100కి పైగా ఆల్‌ ఇండియా మాక్‌ టెస్టులు, టాపిక్‌ల వారీగా టెస్టులు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఆన్‌లైన్‌ స్టడీ మెటీరియల్‌, నోట్సు అందుబాటులో ఉంటుంది.

NCERT Free Coaching: జేఈఈ, నీట్‌లకు క్రాష్‌ కోర్సులతో పాటు మాక్‌ టెస్ట్‌లు, ప్రాక్టీస్‌ ప్రశ్నలు, వీడియో లెక్చర్స్‌, వెబినార్‌లు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌, కోర్సులు, ఇతర వివరాల కోసం ఈ లింక్‌ https://sathee.prutor.ai/sathee-jee/ పై క్లిక్‌ చేయండి. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో మినహా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యార్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఐఐటీ టాపర్లు, విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులతో ఈ వేదిక ద్వారా పైసా ఖర్చులేకుండా కోచింగ్‌ ఇస్తోంది. తెలుగు, ఆంగ్లంతో పాటు పలు భాషల్లో ఈ కోర్సులను అందిస్తున్నారు. అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (AICTE) దీనికోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ఆధారిత ట్రాన్సిలేషన్‌ టూల్‌ను అభివృద్ధి చేయగా పలు భాషల్లో సేవలందిస్తోంది.

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

ఫ్రీ కోచింగ్ కోసం ఇలా రిజిస్ట్రేషన్‌ చేయండి..

https://sathee.prutor.ai/sathee-jee/

- ముందుగా పైన ఉన్న సాథీ పోర్టల్‌ను సందర్శించాలి.

- ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సైన్‌ ఇన్‌లోకి వెళ్లి మీ వివరాలు ఎంటర్‌ చేయాలి. లేదంటే సైన్‌ అప్‌ అవ్వాల్సి ఉంటుంది.

- మీ పేరు, ఈ- మెయిల్‌ ఐడీ, ఫోన్ నంబర్‌తో పాటు మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి.

- జేఈఈ/నీట్‌/ఎస్‌ఎస్‌సీ/బ్యాంకింగ్‌/ఐసీఏఆర్‌/సీయూఈటీ ఇలా మీరు దేనికి ప్రిపేర్‌ కావాలనుకొంటున్నారో ఆ వివరాలను ఎంచుకోవాలి.

- రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక లాగిన్‌ అయ్యి లైవ్‌ సెషన్లు, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టూల్స్‌, వీడియో లెక్చర్లు వినొచ్చు.

Comments

-Advertisement-