-Advertisement-

Sarpanch Elections: నన్ను గెలిపిస్తే ఈ పనులన్నీ చేసి పెడతా.. మ్యానిఫెస్టో విడుదల చేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి

Sarpanch Elections News Sarpanch Elections dates Sarpanch Elections process Sarpanch candidate eligibilitys Sarpanch salary Panchayati elections dates
Peoples Motivation

Sarpanch Elections: నన్ను గెలిపిస్తే ఈ పనులన్నీ చేసి పెడతా.. మ్యానిఫెస్టో విడుదల చేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఓ అభ్యర్థి..

14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టో విడుదల..

యాదాద్రి జిల్లా మల్కాపూర్‌లో ఓ నాయకురాలు వినూత్న ఆలోచన..

మల్కాపూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ..

Sarpanch Elections News Sarpanch Elections dates Sarpanch Elections process Sarpanch candidate eligibilitys Sarpanch salary Panchayati elections dates

ఎన్నికలు అనగానే పోటీ చేసే అభ్యర్థులు వారు గెలిచిన తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక మేనిఫెస్టో తయారుచేసి ప్రకటిస్తారు. ఇలా సమయంలో రాజకీయ పార్టీలు ప్రధాన హామీలతో మేనిఫెస్టో తయారుచేసి విడుదల చేయడం తెలిసిందే. అయితే, పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఓ అభ్యర్థి కూడా మేనిఫెస్టో విడుదల చేశారు.  ప్రచారంలో దాని గురించే విస్తృతంగా చెప్పుకుంటాయి. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు  సిద్ధమవుతున్న వేళ ఓ సర్పంచ్ అభ్యర్థి ముందస్తుగానే రెడీ అయ్యారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్‌లో ఓ సర్పంచ్ అభ్యర్థి తన మ్యానిఫెస్టోను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తం 14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కొడారి లత అనే నాయకురాలు పార్టీలకు అతీతంగా తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టో ఇలా..

• గ్రామంలో మంచినీటి ఫిల్టర్ ఏర్పాటు

• కులాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం వైకుంఠ రథం, ఫ్రీజర్

• ఇంటి పన్ను మాఫీ

• ఇంట్లో ఎవరైనా చనిపోతే రూ. 20 వేల ఆర్థిక సాయం

• ఆడపిల్ల జన్మిస్తే రూ. 5 వేలు

• ఆడపడుచు పెళ్లి కానుక

• ఒంటరి మహిళకు, వృద్ధులకు నివాస వసతి గృహం

• ఎస్సీ, బీసీలకు కమ్యూనిటీ హాల్

• నిరుద్యోగ ఆడపడుచులకు 30 కుట్టు మిషన్లతో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్

• స్కూలు పిల్లలకు నోటు పుస్తకాలు

• ముదిరాజ్‌లు చేపలు పెంచుకునేందుకు చెరువులపై పూర్తి అధికారం

• గ్రామ దేవత గుడి నిర్మాణం

• అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం

• బస్తీ దవాఖానా, గ్రంథాలయం

Comments

-Advertisement-