-Advertisement-

Sarpanch: వేలం పాట లో రూ.2 కోట్లకు సర్పంచ్ పదవి... విచారణకు ఆదేశించిన కలెక్టర్!!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

Sarpanch: వేలం పాట లో రూ.2 కోట్లకు సర్పంచ్ పదవి... విచారణకు ఆదేశించిన కలెక్టర్!!

• గ్రామ సర్పంచ్ పదవికి బహిరంగ వేలం...

• రూ.2కోట్లకు వేలంలో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ నాయకుడు...

• వేలంను తప్పుబడుతున్న కాంగ్రెస్ నేతలు...

• వేలంపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

Sarpanch: దేశవ్యాప్తంగా ఎప్పుడు ఏదోఒక రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతునే ఉంటాయి. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

ఇప్పటికే సర్పంచ్ సీటు కోసం ఇప్పటికే పలువురు నాయకులు పావులు కదుపుతుండగా పలు స్థానాలు ఏకగ్రీవమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే పంజాబ్ రాష్ట్రంలో సర్పంచ్ పదవిని వేలం పాట వేయడం చర్చనీయాంశమైంది.

రూ.2 కోట్లకు సర్పంచ్ సీటు కైవసం...

ఈ మేరకు పంజాబ్ లో 13,237 సర్పంచ్ స్థానాలకు అక్టోబరు 15న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను సమర్పించేందుకు అక్టోబరు 4వ తేదీ తుది గడువు. పోలింగ్ ముగిసిన తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలోనే గురుదాస్పుర్ లోని హర్దోవల్ కలన్ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలం పాట నిర్వహించారు. మొదట రూ.50లక్షలతో మొదలైన వేలం పాట కోట్ల రూపాయలకు చేరుకుంది. అక్కడి స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మాసింగ్ ఏకంగా రూ.2 కోట్లకు సర్పంచ్ సీటు సొంతం చేసుకున్నాడు. గ్రామానికి నిధులు ఎక్కువగా తీసుకొచ్చేవారే సర్పంచ్ పదవికి అర్హులని, అలాంటి వారినే ప్రజలు ఎన్నుకుంటారని ఈ సందర్భంగా ఆత్మాసింగ్ చెప్పారు.

విచారణకు ఆదేశించిన కలెక్టర్...

అయితే ఈ వేలం పాట తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఎన్నిక అధికారికం కాదు. ఇది బహిరంగ అవినీతి. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి బాధ్యులను శిక్షించాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశించగా సర్పంచి ఎన్నికకు ఆత్మాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక పంజాబ్ లో సర్పంచ్ పదవి వేలం వేయటం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు బఠిండాలోని గెహ్రి బత్తార్ గ్రామంలో సర్పంచ్ పదవి రూ.60 లక్షలు పలికినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది.

Comments

-Advertisement-