-Advertisement-

Sabarimala: ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

Sabarimala online booking date Sabarimala online ticket booking 2024 www.sabarimala online.org login Sabarimala Online registration Sabarimala online
Peoples Motivation

Sabarimala: ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

• రోజుకు 80 వేల మందికే దర్శనం...

• భక్తుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం...

• వర్చువల్ క్యూ బుకింగ్ విధానం అమలు చేయాలని కేరళ సర్కారు నిర్ణయం...

• కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన కీలక సమావేశం...

Sabarimala online booking date Sabarimala online ticket booking 2024 www.sabarimala online.org login Sabarimala Online registration Sabarimala online room booking

త్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుంది. ఇవాళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇకమీదట శబరిమల వచ్చే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అయ్యప్ప భక్తులు పరమపవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. 

స్వామివారి దర్శనానికి ఆన్ లైన్ బుకింగ్ ను తీసుకువస్తున్న కేరళ ప్రభుత్వం... రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. వర్చువల్ క్యూ బుకింగ్ విధానంలో భక్తులు తాము వచ్చే మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రమంలో, అటవీమార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.

భక్తుల రద్దీ నేపథ్యంలో!

గతేడాది డిసెంబరులో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కల్పించలేక ఇబ్బందులు పడింది. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి స్వగృహాలకు పయనమయ్యారు. అప్పట్లో దేవస్థానం బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్లను దేవస్థానం బోర్డు రద్దు చేసింది.దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకరజ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజూ 1,20,000 మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకుంటారని అంచనా. గత మండల సీజన్లో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దర్శన సమయాన్ని గంట పెంచిన రద్దీని నియంత్రించలేకపోయారు.

Comments

-Advertisement-