RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ పేమెంట్స్ప్- యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితుల పెంపు
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ పేమెంట్స్ప్- యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితుల పెంపు
యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచుతూ పండగ సీజన్లో ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ డిజిటల్ పేమెంట్స్ప్ లైట్, వ్యాలెట్ పరిమితులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచుతూ పండగ సీజన్లో ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ డిజిటల్ పేమెంట్స్ప్ లైట్, వ్యాలెట్ పరిమితులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5వేలకు పెంచినట్లు తెలిపారు. దీంతో చిన్న మొత్తంలో లావాదేవీలు చేసే యూజర్స్ ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు.
"యూపీఐ సర్వీసులతో డిజిటల్ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. ఈ సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో దేశంలో నగదు డిజిటల్ లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి. యూపీఐ సేవలను మరింత విస్తృతపరచడానికి, ప్రోత్సహించడానికి మేం మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని ఎంపీసీ సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. మొత్తంగా యూపీఐకి సంబంధించి మూడు ప్రధాన మార్పులు జరగనున్నాయి. అవేంటంటే?
యూపీఐ డిజిటల్ పేమెంట్స్ప్ లావాదేవీల్లో కొత్త మార్పులు ఇవే:-
యూపీఐ లైట్ పరిమితిని ప్రస్తుతమున్న రూ.500 నుంచి రూ.1,000కి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని ప్రస్తుతమున్న రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వీటితో పాటు ప్రతి లావాదేవీకి 'యూపీఐ 123పే' లిమిట్‌ను కూడా రూ.5 వేల నుంచి రూ. 10,000కు పెంచారు.
యూపీఐ లైట్ అంటే..?
యూపీఐ లైట్ సౌకర్యాన్ని ఆర్బీఐ ప్రారంభించింది.
యూపీఐ నుంచి లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసేందుకు యూపీఐ లైట్ను సెప్టెంబర్ 2022లో తీసుకొచ్చారు.
ప్రతిసారీ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా పేమెంట్ చేసేందుకు యూపీఐ లైట్ సేవలు సహకరిస్తాయి.
ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 ఉండగా ఆ మొత్తాన్ని రూ.1000కి పెంచారు.
యూపీఐ లైట్ వ్యాలెట్ అంటే..?
యూపీఐ లైట్ సర్వీసులు పొందాలంటే అందుకోసం యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఉండాలి.
తాజాగా దీని లిమిట్‌ను రూ.2,000 నుంచి రూ.5,000లకు పెంచారు.
యూపీఐ 123పే అంటే..?
యూపీఐ 123పే అనేది నాన్-స్మార్ట్ఫోన్/ఫీచర్ ఫోన్లు ఉపయోగించే యూజర్స్కు సంబంధించినది.
ఇది స్మార్ట్ ఫోన్ కాకుండా ఫీచర్ ఫోన్ ద్వారా డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది.
ప్రస్తుతం దీని పరిమితిని రూ. 5,000 నుంచి రూ. 10,000కు పెంచారు.