-Advertisement-

PM KISAN: రైతన్నలకు శుభవార్త- నేడు అకౌంట్లోకి "పీఎం కిసాన్" డబ్బులు - ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి!

www.pmkisan.gov.in pm kisan status check aadhar card pm kisan payment status pm kisan status kyc pm kisan.gov.in registration pm kisan samman nidhi
Peoples Motivation

PM KISAN: రైతన్నలకు శుభవార్త- నేడు అకౌంట్లోకి "పీఎం కిసాన్" డబ్బులు - ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి!

అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు శుభవార్త చెప్పనుంది. అక్టోబర్ 5న అనగా ఈ రోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి..

www.pmkisan.gov.in pm kisan status check aadhar card pm kisan payment status pm kisan status kyc pm kisan.gov.in registration pm kisan samman nidhi

18వ విడత నిధులు విడుదల...

అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్‌ పథకం 18వ విడత నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకం ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. మరి ఆ లబ్ధిదారుల్లో మీరు ఉన్నారేమో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి. 2019లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 17 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. తాజాగా.. 18వ దఫా పీఎం కిసాన్ డబ్బులను "2024, అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాశిమ్లో " ప్రధాని నరేంద్ర మోదీ రిలీజ్ చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది.

పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి...

మొదటగా మీరు www.pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.తర్వాత వెబ్సైట్లోని "Beneficiary List" ఆప్షన్పై క్లిక్ చేయాలి.ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి.లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" ఆప్షన్పై క్లిక్ చేయాలి.మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. ఈ జాబితాలో పేరు ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డట్టే. 

ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ ఇలా తెలుసుకోండి..

ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్ ను ఓపెన్ చేయండి.ఇప్పుడు Know Your Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ను నమోదు చేసి, క్యాప్చా కోడ్ ను ఎంటర్‌ చేయాలి. రిజిస్ట్రేషన్ వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.ఇప్పుడు Get OTP ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్ చేస్తే స్క్రీన్ పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ-కేవైసీ చేయించలేదని అర్థం.

e-KYC ఎలా చేయాలంటే..?

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ లోకి లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత హోమ్ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్పై క్లిక్ చేయాలి.తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 'Search' ఆప్షన్పై క్లిక్ చేయాలి.తర్వాత వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.లేదంటే.. పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు.ఇంకా.. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

Comments

-Advertisement-