PM Internship: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ప్రతి నెల ఇలా రూ.5 వేలు.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!
PM Internship: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ప్రతి నెల ఇలా రూ.5 వేలు.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!
కేంద్ర ప్రభుత్వం యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభమైంది. దీని ద్వారా యువతకు ఉపాధి కల్పించబడుతుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
PM Internship: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ప్రతి నెల ఇలా రూ.5 వేలు.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!
PM Internship: కేంద్రం ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మోదీ ప్రభుత్వం యువత కోసం ‘పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్’ను ప్రారంభించింది. ఈ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో 21 నుంచి 24 ఏళ్లలోపు 1,25,000 మంది యువతకు ఇంటర్న్‌షిప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందుకోసం రూ.800 కోట్లు కేటాయించారు. ఈ పథకం దేశంలో ఉపాధిపై దృష్టి సారించే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా పనిచేస్తుంది. ఇంటర్న్‌షిప్ 12 నెలల పాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ స్కీం కింద వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో కోటి మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ పథకానికి ఎవరు అర్హులు..
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు...భారత పౌరుడై ఉండాలి. అలాగే, ఎక్కడా ఉద్యోగం చేయకూడదు. హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్, డిప్లొమా లేదా పాలిటెక్నిక్ వంటివి కల్గి ఉండాలి. BA, B.Sc, B.Com వంటి డిగ్రీలు కలిగి ఉండవచ్చు. BCA, BBA, B.Pharma ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా ఆన్‌లైన్‌లో లేదా దూర ప్రాంతాల నుంచి చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు నచ్చిన రంగం, కార్యాలయాన్ని బట్టి మీరు గరిష్టంగా 5 అవకాశాల కోసం దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి.
నెలవారీ స్టైఫండ్ ఎంత?
దరఖాస్తుదారులు 12 నెలల ఇంటర్న్‌షిప్ కోసం నెలవారీ సహాయంగా రూ. 5000 అందుకుంటారు. ఇందులో ప్రభుత్వం రూ.4500, కంపెనీ తన సీఎస్‌ఆర్ ఫండ్ నుంచి రూ.500 ఇస్తుంది. కంపెనీ కోరుకుంటే, దాని స్వంత వైపు నుంచి రూ. 500 కంటే ఎక్కువ చెల్లించవచ్చు. అలాగే పీఎం జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్, పీఎం సురక్ష యోజన ప్రయోజనాలను పొందుతారు.
ఆన్‌లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు ఆన్‌లైన్ పోర్టల్ https://pminternship.mca.gov.in/login/ లో PM ఇంటర్‌షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో అభ్యర్థులు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 25 వరకు అప్లై చేయాలి. దరఖాస్తుదారులను అక్టోబర్ 26న ఎంపిక చేస్తారు. కంపెనీలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు కంపెనీల ఇంటర్న్‌షిప్ ఆఫర్‌లను అంగీకరించడానికి నవంబర్ 8 నుంచి 15 వరకు సమయం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. 12 నెలల పాటు ఉంటుంది. ఇప్పటివరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 111 కంపెనీలను చేర్చింది. ఇందులో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆటోమోటివ్, ఫార్మా సహా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం తేదీ: అక్టోబర్ 12
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 25
షార్ట్ లీస్ట్ తేదీ: అక్టోబర్ 26న
కంపెనీలు ఎంపిక తేదీ: అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు
కంపెనీల ఆఫర్‌లను అంగీకరించడానికి: నవంబర్ 8 నుంచి 15 వరకు
ఇంటర్న్‌షిప్ ప్రారంభం తేదీ: డిసెంబర్ 2 నుంచి 12 నెలల వరకు
మిగతా సమాచారం కోసం కింది వెబ్సైట్ పై క్లిక్ చేయండి 👇