Nobel Prize: ఈ ఏడాది దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
Nobel Prize: ఈ ఏడాది దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను కళ్లకు కట్టినట్లు రాసిన గద్యానికి గుర్తింపుగా సాహిత్య విభాగంలో సౌత్ కొరియాకు చెందిన హాన్ కాంగ్కు నోబెల్ అవార్డు
మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను కళ్లకు కట్టినట్లు రాసిన గద్యానికి గుర్తింపుగా సాహిత్య విభాగంలో సౌత్ కొరియాకు చెందిన హాన్ కాంగ్కు నోబెల్ అవార్డు ప్రకటించినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. హాన్ కాంగ్ 'ది వెజిటేరియన్' రచనకు గాను 2016లో అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. మాంసాహారం మానేయాలని ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఎలాంటి వినాశకర పరిణామాలకు దారితీసిందనే నేపథ్యంగా వెజిటేరియన్ నవల ఉంటుంది. 2018లో 'హ్యుమన్ యాక్ట్' నవల అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ఫైనల్‌కు చేరింది.
సాహిత్య విభాగంలో ఇప్పటి వరకు 119 నోబెల్ పురస్కారాలు లభించాయి. వారిలో 17 మంది మహిళలు ఉన్నారు. చివరిగా 2022లో ఫ్రాన్స్కు చెందిన అన్నీ ఎర్నాక్స్ నోబెల్ పురస్కారం వరించింది. గతేడాది సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం- నార్వేకు చెందిన జాన్ ఫోసేను దక్కింది. ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని ఈ అవార్డును ప్రకటించారు. గతేడాది సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం- నార్వేకు చెందిన జాన్ ఫోసేను దక్కింది. ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని ఈ అవార్డును ప్రకటించారు.
నోబెల్ బహుమతి (Nobel Prize)...
స్వీడెన్కు చెందిన దిగ్గజ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గుర్తుగా ఏటా డిసెంబర్ 10న ఈ పురస్కారాలు అందిస్తారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని నోబెల్ కమిటీ ఇందుకు ఎంపిక చేస్తుంది. సోమవారం వైద్య రంగంలో పురస్కార విజేతల ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ సీజన్ ప్రారంభమయ్యింది. అక్టోబరు 14 వరకు రోజూ ఒక్కో రంగంలో పురస్కారం అందుకునే వారి పేర్లను కమిటీ ప్రకటించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఎవరికి దక్కనుందో శుక్రవారం తేలనుంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు విజేత ఎవరో వచ్చే సోమవారం తెలియనుంది. నోబెల్ అవార్డు కింద మిలియన్ డాలర్ల నగదు బహుమతి అందిస్తారు.