-Advertisement-

NICL: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS
Peoples Motivation

NICL: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు

కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం... దేశవ్యాప్తంగా ఎన్‌ఐసీఎల్‌ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-III కేడర్‌లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 24 - నవంబర్‌ 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS

 ఖాళీల వివరాలు

అసిస్టెంట్ (క్లాస్-III కేడర్‌): 500 (ఎస్సీ- 43; ఎస్టీ- 33; ఓబీసీ- 113; ఈడబ్ల్యూఎస్‌- 41; యూఆర్‌- 270)

ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణ రాష్ట్రంలో 12 ఖాళీలు ఉన్నాయి.

అర్హత

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం.

వయస్సు

01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

 పే స్కేల్: నెలకు రూ.22,405- రూ.62,265.

 ఎంపిక విధానం

ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు:-

ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు).

ప్రశ్నల సంఖ్య: 100. మొత్తం మార్కులు 100.

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.

దరఖాస్తు ఫీజు

రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100.


ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 24 అక్టోబర్ 2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 11, 2024.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 24 అక్టోబర్ 2024 నుంచి 11 నవంబర్ 2024 వరకు.

ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 30 నవంబర్ 2024.

ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 28 డిసెంబర్ 2024.

మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు:-

టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు)

ప్రశ్నల సంఖ్య: 200. మొత్తం మార్కులు 200.

పరీక్ష వ్యవధి: 120 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో మెయిన్‌ ఎగ్జామినేషన్ కేంద్రాలు: హైదరాబాద్.

అధికారిక వెబ్సైట్: https://nationalinsurance.nic.co.in/recruitment/

Comments

-Advertisement-