చాలా మంది శంకర్ దాదా MBBS లే... రక్తం తాగుతున్న కేటుగాళ్ళు..!
చాలా మంది శంకర్ దాదా MBBS లే... రక్తం తాగుతున్న కేటుగాళ్ళు..!
-డాక్టర్ వాణిశ్రీ
వైద్యో నారాయణ హరీ..! అంటారు.. జబ్బు చేస్తూ, నయం చేస్తారంటూ దేవుడిలా భావిస్తూ, వైద్యుల దగ్గరకు వెళ్తారు. అలాంటిది అరకొర చదువులతో క్లినిక్‌లు తెరిచి ప్రజల జనం నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే వైద్యం పేరుతో జనాలను దోచేస్తున్న నకిలీ డాక్టర్ల భరతం పడుతున్నారు ప్యాపిలి ప్రభుత్వ వైద్యాధికారులు. ప్యాపిలి పట్టణం లో క్లీనిక్స్‌పై దాడులు చేశారు.
నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నకిలీ వైద్యుల ఆటకట్టిస్తున్నారు. గత రెండు రోజుల క్రింద క్లినిక్స్ పై దాడులు చేసిన వైద్యురాలు
ఆర్ ఎమ్ పి ల అర్హతలు, వారు చదివిన కాలేజ్ వివరాలు తెలుసుకోవాలి అంటున్న ప్రజలు
కొందమందికి వైద్య అర్హతలు లేకపోగా.. RMPలుగా ఉంటూ క్లీనిక్ లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చట్ట పరంగా నోటీసులు అందించడంతో పాటు వెంటనే క్లీనిక్ లను మూసివేయలంటూ సూచించారు. పలు క్లీనిక్స్‌పై ఫిర్యాదులు రావడంతో నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోన్నన్నట్లు వైద్య మండలీ అధికారి వాణిశ్రీ తెలిపారు. ప్యాపిలి పట్టణం లో రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడిన మరియు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే అధికారం పొందిన కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టడీని (ఎం బి బి ఎస్ )పూర్తి చేసుకున్న తరువాత, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ గా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ యొక్క స్టేట్ మెడికల్ రిజిస్టర్ క్రింద నమోదు చేయబడతారు. వైద్యో నారాయణో హరిః అంటూ అన్ని కులాల వారు, మతాల వారు వర్గ విభేదాలు లేకుండ రెండు చేతులు జోడించి భగవంతునితో సమానంగా నమస్కరిస్తున్నాము. వారు మాత్రమే అధీకృత వైద్యులు. అయితే జనాలను మోసం చేసేందుకు జలగల్లా పీక్కుతినేందుకు బెండు అప్పారావులు
ఆర్ ఎం పి మరొక అర్థం తెచ్చి..
రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ గా అవతారమెత్తి అమాయక పేద ప్రజల ధనాన్ని కొల్లగొడుతూ అరకొర వైద్యంతో వారి ప్రాణాలను హరీ మనిపిస్తున్నారు.
ప్యాపిలి పట్టణములో ప్రభుత్వ వైద్యశాలలో ఇద్దరు డాక్టర్లు మాత్రమే అర్హత కలిగిన వారుండగా మెడికల్ షాపులు మాత్రం 18 దాకా ఉన్నాయి. 20 మంది వరకు గ్రామీణ వైద్యులు అదే బెండు అప్పారావులు వైద్యం చేస్తుండగా వారిలో 8 మంది పాత బస్టాండ్ సమీపాన నలుగురు, సినిమాగేరి వద్ద ఒకరు, కొత్త బస్టాండ్ దగ్గరలో ఇద్దరు, ఏకంగా క్లినిక్, మెడికల్ షాపు అనే వ్యత్యాసం లేకుండా రెండూ ఒకటి చేసి వైద్యమూ వారే, మందులు ఇచ్చేది వారే.. ద్విపాత్రాభినయంతో నడుపుతున్నారు.
కాగా రక్త పరీక్షలు నిర్వహించి జబ్బును నిర్దారించాల్సిన ల్యాబులు 6 దాకా ఉన్నాయి. ల్యాబ్ నిర్వహించాలంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ తో పాటుగా ప్రభుత్వ వైద్యశాలలో ఒక సంవత్సరం పాటు నిష్ణాతులైన సీనియర్ టెక్నీషియన్ వద్ద ట్రైనింగ్ పొంది ఉండాలి. అదీ కూడా అంతే మయానే.. జబ్బు చేసిన రోగి రక్త నమూనాలో ఉన్న లోపాన్ని గుర్తించి వైద్యం చేస్తారు. చాలా వరకు రక్త పరీక్ష చేసి రిపోర్ట్ ఇచ్చేవారు.., రిపోర్ట్ ఆధారంగా వైద్యం చేసేవారు దొందూ దొందే అన్నట్టు ఇరువురూ అర్హతలు లేనివారే.. నాణ్యమైన విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండాలి. ఇది ప్రభుత్వాల కనీస భాధ్యత. నేడు ఇవి ఏవి కంటికి కనిపించనంత దూరంలో పేదవాడికి అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పేదలను ఆదుకుని ప్రాణాలతో చెలగాట మాడుతున్న బెండు అప్పారావుల బెండు తీసి వారి నుండి కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.